పాజిటివ్ మూడ్ తో మొదలవటం హ్యాపీ..మహేష్ బాబు
ఈ శుక్రవారం నేను టర్కీ వెళ్ళబోతున్నాను. శ్రీనువైట్లతో చేయబోతున్న దూకుడు చిత్రం షూటింగ్ అక్కడ 15 రోజుల పాటు జరుగుతుంది. పాజిటివ్ మూడ్ లో శ్రీనువైట్లతో సినిమా ప్రారంభం కావటం ఆనందంగా ఉంది అంటున్నారు మహేష్ బాబు. దాదాపు పది నెలల అనంతరం శ్రీను వైట్ల మెగా ఫోన్ పట్టి చేస్తున్న చిత్రం ఇది. నమో వెంకటేశ తర్వాత అదే బ్యానర్ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై శ్రీను వైట్ల ఈ చిత్రం చేస్తున్నారు. నిజానికి ఈ చిత్రం షూటింగ్ జూలైలో మొదలవ్వవలిసింది. అయితే మహేష్ ఖలేజా రిలీజ్ తర్వాత చేస్తామని చెప్పి వాయిదావేసుకుంటూ వచ్చారు. ఇక ఈ చిత్రంలో ఏమి మాయ చేసావే భామ సమంత...మహేష్ కి జోడీగా చేస్తోంది.తాజాగా ఆమె ఎన్టీఆర్ సరసన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో బృందావనం చిత్రంలో హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే.
తమన్ సంగీతం దర్శకత్వంలో....నీ దూకుడు...సాటి ఎవడు అంటూ దూకుడు కోసం ఓ పాటని రికార్డింగ్ చేసారు. ఈ చిత్రంలో మేజర్ పార్టు నార్త్ ఇండియాలో షూటింగ్ జరుగుతుంది. శ్రీను వైట్ల తన కెరీర్ లో మొదటి సారిగా సూపర్ 35 ఎం.ఎం కెమెరాను ఈ చిత్రం కోసం వినియోగిస్తున్నాడు. టెక్నికల్ గానూ హై స్టాండర్డ్స్ తో ఈ చిత్రం రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ అందిస్తూంటే కోన వెంకట్ మాటలు రాస్తున్నారు. ఇప్పటివరకూ మహేష్ ని ఎవరూ అలా చూసి ఉండరు. ఈ చిత్రం గురించి శ్రీను వైట్ల మాట్లాడుతూ ...సినిమాలో కొత్త మహేష్ ని చూస్తారు. కేవలం కామెడీ మాత్రమే కాకుండా మహేష్ సినిమాల్లో ఉండే యాక్షన్ కూడా ఇందులో చాలా బాగుంటుంది. మహేష్ కెరీర్ మరో సూపర్ హిట్ ఇవ్వాలనే కసితో ఈసినిమాకి వర్క్ చేస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











