మహేష్ బాబు 'దూకుడు' టైటిల్ కి ట్యాగ్ లైన్ పెట్టారు
మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న 'దూకుడు' చిత్రానికి ట్యాగ్ లైన్ గా డేరింగ్ అండ్ డ్యాషింగ్ అని పిక్స్ చేసినట్లు సమాచారం. సమంత హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. ఈ చిత్రంలో మహేష్ పోలీస్ ఆఫీసర్ కనిపించనున్నారు. అలాగే ఈ చిత్రంలో మహేష్ బాబు పాత్ర చిత్రణ ప్రధాన ఆకర్షణ కానుందని చెప్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకొంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. ఈ చిత్రానికి గోపి మోహన్ కథను అందిస్తున్న ఈ చిత్రంలో మహేష్ కేవలం కాసేపు కాకుండా సినిమా అంతటా పోలీస్ గెటప్ లోనే కనిపిస్తాడని చెప్తున్నారు. 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీను వైట్ల మార్కు కామెడీతో పాటు మహేష్ సినిమాల్లో వుండే హై ఓల్టేజ్ యాక్షన్ ఉంటుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











