మహేష్ చేతికి ‘సౌతిండియా షాపింగ్ మాల్’
హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి నెం.1 అని నిరూపించుకున్నాడు. అత్యధిక కార్పొరెట్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ నెం.1 పొజిసన్లో ఉన్న మహేష్ బాబు ఖాతాలోకి మరో బ్రాండ్ వచ్చి చేరింది. సౌతిండియాలోని ప్రముఖ వస్త్రాభరణాల ఫ్రాంచైజీ 'సౌతిండియా షాపింగ్ మాల్'కి బ్రాండ్ అంబాసిడర్‌గా డీల్ కుదుచ్చుకున్నాడు.
ఇందుకు గాను మహేష్ బాబుకు భారీ మొత్తం ఇచ్చేందుకు సదరు సంస్థ సిద్ధమైనట్లు తెలుస్తోంది. వరుసగా మూడేళ్లకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఈ విషయమైన అధికారిక వివరాలు త్వరలో తెలియనున్నాయి. గతంలో ఈ సంస్థ తరుపున జెనీలియా, సమంతలు ప్రచారం చేసిన విషయం తెలిసిందే.
ఇప్పటి వరకు ఏ తెలుగు హీరో కూడా మహేష్ బాబు రేంజిలో యాడ్ ఫిల్మ్స్ ద్వారా సంపాదించడం లేదు. ఇటు కమర్షియల్ యాడ్లలో...మరో వైపు సినిమాల్లో సూపర్ స్టార్‌గా కొనసాగుతూ చేతి నిండా సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో వెంకటేష్ మరో హీరోగా నటిస్తున్నారు. మహేష్ సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి నటిస్తున్నారు.
వెంకీ-మహేష్ అన్నదమ్ముళ్లుగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే టాలీవుడ్ లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అన్నదమ్ముల రిలేషన్ ఈ చిత్రంలో మెయిన్‌గా ఫోకస్ కానుంది. ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో మరో చిత్రం చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











