మహేష్ బాబు ఫ్యాన్స్‌కు పండగే : రాజమౌళి
హైదరాబాద్ : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రాల దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో త్వరలో ఓ సినిమా రూపొందబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా మహేష్ బాబు అభిమానులు ఫెంటాస్టిక్ ఎక్స్‌పీరియన్స్ పొందుతారు అంటున్నారు ప్రముఖ దర్శకుడు రాజమౌళి.
ఇటీవల ముంబై వెలుతుంటే దర్శకుడు క్రిష్ విమానంలో రాజమౌళికి కలిసారట. ఈ సందర్భంగా క్రిష్ తనకు మహేష్ బాబుతో చేయబోయే సినిమా స్టోరీ చెప్పారని, ఎంతో గొప్పగా ఉందని, మహేష్ బాబు అభిమానులకు ఫెంటాస్టిక్ ఎక్స్‌పీరియన్స్ లా సినిమా ఉంటుందని రాజమౌళి తన ట్విట్టర్లో చెప్పుకొచ్చారు.
ఇప్పటికే స్క్రిప్టు వర్క్ కంప్లీట్ చేసినట్లు స్పష్టం చేసిన క్రిస్... వచ్చే ఏడాది సమ్మర్లో షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈ చిత్రం పూర్తి కమర్షియల్ నేపథ్యంలో రూపొందించేందుకు దర్శకడు ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈచిత్రానికి 'శివం' అనే టైటల్ పరిశీలిస్తున్నారు.
ఈ చిత్రంలో సోనాక్షి సిన్హాను హీరోయిన్ గా తీసుకోవాలని దర్శకుడు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె ఈ చిత్రానికి సైన్ చేసాక అధికారిక ప్రకటన వెలువడనుంది. అశ్వినీదత్ వైజయంతీ మూవీస్ బేనర్ పై ఈచిత్రం రూపొందనుంది.


Click it and Unblock the Notifications











