twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దూకుడు సెన్సార్ రిపోర్ట్ తో పండగ చేసుకొంటున్న మహేష్ ఫ్యాన్స్...!

    By Sindhu
    |

    ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ మధ్య ఈ నెల 23న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది దూకుడు సినిమా. ఈ సినిమా అన్ని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లను పూర్తి చేసుకుని సెన్సార్ అనుమతి కోసం చూస్తోంది. ఎట్టకేలకి మహేష్ బాబుకి, ఫాన్స్ కి శుభవార్త చేరువైయింది. ఈ రోజు దూకుడు సినిమాకి సెన్సార్ బోర్డ్ U/A గా సెర్టిఫై చేసింది.

    నిన్న ప్రింట్ బాలేదు, ఆడియో, వీడియో క్లియర్ గా లేవనే కారణం చేత సినిమాని తిరస్కరించారనే వార్తలు వచ్చాయి. కాని సినిమాలో అన్నిబాగున్నాయి అని క్వాలిటీ కూడా చాల బాగా వచ్చింది, ఎక్స్ లెంట్ గా చిత్రీకరించారని నిర్మాత అనిల్ కుమార్ చెప్పారు. ముందు అనుకున్నట్టుగానే ఈ నెల 23న ఈ సినిమాని అత్యధిక ప్రింట్స్ తో ప్రపంచ వ్యాప్తం గా విడుదల చేయుచున్నారు.

    కాగా తెలంగాణా ప్రాంతంలో సకలజనుల సమ్మె ఉదృతంగా జరుగుతున్న ప్రస్తుత తరుణంలో విడుదలవుతున్న పెద్ద హీరో చిత్రంగా 'దూకుడు'ను చెప్పుకోవచ్చు. ఈ చిత్రం విడుదల సంధర్భం చిత్రం ప్రదర్శించే థియేటర్ల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రక్షణ కల్పించాలని ఈచిత్ర నిర్మాతలు సిఎంకు విజ్ఞప్తి చేసినట్టు సమాచారం.

    ఈ చిత్రంలో పార్వతి మెల్టన్ ఒక ఐటెం సాంగ్ ని చేస్తున్నట్లు సమాచారం. యస్ యస్ తమన్ బాణీలు సమకూర్చగా, శ్రీనువైట్ల ఈ సినిమాకి దర్సకత్వం వహించారు. ఇంకా ప్రకాష్ రాజ్, సోను సూద్, బ్రహ్మానందం, యంయస్ నారాయణ, సోనియా హ్యాపీ డేస్ ఫేం, వెన్నెల కిషోర్, నాజర్, సయాజీ షిండే, మాస్టర్ భరత్ లు ఈ సినిమాలో ప్రధానపాత్రలు పోషించారు.

    English summary
    All the roadblocks for the bumper release of Superstar Mahesh Babu’s Dookudu are now clear. The movie will hit the screens worldwide on September 23rd and the movie has received a U/A certificate from the Censor Board.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X