ఫేస్ బుక్ లో సైతం మహేష్ ఫ్యాన్స్ వీరంగం

మరో ప్రక్క డైరక్ట్ గానే టీవీ ఛానెల్స్ లో,పేపర్లులో చర్చలతో ఫ్యాన్స్ యుద్దం చేస్తున్నారు.అంతేగాక బ్యానర్స్ కట్టి మరీ ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటున్నారు.రెండు రోజుల క్రితం ఓ తెలుగు దినపత్రిక మగధీర రికార్డుల గురించి యాడ్ ఇచ్చి మెగాభిమానులు తమ సత్తా చాటుకున్నారు.ఇక ఈ వివాదం దూకుడు పంక్షన్ లో మొదలైంది.యాభై రోజుల పంక్షన్ లో ఈ చిత్రం రికార్డుల గురించి నిర్మాతలు ప్రస్దావించటంతో కోపం వచ్చిన మెగా ఫ్యాన్స్ ..
తమ మగధీరను దూకుడు దాటలేదని,దాటిందని లెక్క చూపిస్తే లక్ష ఇస్తామని బహిరంగ ప్రకటన చేసారు.దానికి స్పందించిన మహేష్ ఫ్యాన్స్ ..తమ దూకుడు కలెక్షన్స్ ..మగధీరను దాటలేదని నిరూపిస్తే కోటి ఇస్తామని కౌంటర్ ఇస్తారు.అంతేగాక రామ్ చరణ్ సైతం ట్విట్టర్ లో అన్యాపదేశంగా ఈ వివాదం పై స్పందించాడు.దానికి రామ్ గోపాల్ వర్మ మహేష్ ని సపోర్టు చేస్తూ ట్వీట్ చేసారు.ఇది చాలదన్నట్లు అల్లు శిరీష్ ..మహేష్ ఫ్యాన్స్ కు మీ నిర్మాతను బహిరంగ చర్చకు రమ్మనమని సవాల్ విసిరాడు.ఈ నేపధ్యంలో ఈ ఫేస్ బుక్ లో మొదలైన ఈ వివాదానకి మెగా ఫ్యాన్స్ ఏ రకంగా సమాధానమిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











