అల్లు శిరీష్ కాదు..సొల్లు శిరీష్!
అతగాన్ని అల్లు శిరీష్ అనడం కంటే..సొల్లు శిరీష్ అనడం మేలు అంటూ చిటపడలాడుతున్నారు కొందరు మహేష్ బాబు అభిమానులు. ఇంతకీ వీరికి శిరీష్ పై ఇంతలా కోపం రావడానికి కారణం ఏమిటీ.. అనుకుంటున్నారా?. ఇటీవల విడుదలైన మహేష్ బాబు 'దూకుడు" మూవీ భారీ కలెక్షన్ లతో దూసుకెలుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటి వరకు ఇండస్ట్రీలో హైయ్యెస్టు కలెక్షన్స్ సాధించిన మూవీగా రికార్డులకెక్కిన మగధీర సినిమా రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం అనే వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో 'దూకుడు" సినిమా ఉద్దేశించి శిరీష్ చేసిన కామెంట్స్ మహేష్ బాబు అభిమానలకు కోపం తెప్పిస్తున్నాయి.
శిరీష్ నేరుగా దూకుడుపై అటాక్ చేయక పోయినా..ఇండైరెక్టుగా ఓ హిందీ సినిమాను అడ్డు పెట్టుకుని సెటర్లు వదిలారు. ప్రస్తుతం బాలీవుడ్ లో బాడీగార్డు సినిమా మంచి కలెక్షన్లతో దూసుకెలుతోంది, అయితే ఆ సినిమా 3ఇడియట్స్ సినిమాను మాత్రం బీట్ చేయలేదని నేను ఖశ్చితంగా చెప్పగలను. అదే విధంగా తెలుగు లోనూ ఇదే విధంగా కొన్ని సినిమాలు ఉరకలేస్తున్నాయి. అయితే ఆ సినిమాలకు రికార్డు బద్దలు కొట్టేంత సీన్ లేదంటూ కామెంట్ చేశాడట. శిరీష్ చేసిన ఈ వ్యాఖ్యలు దూకుడు సినిమాను ఉద్దేశించే అంటున్నారు మహేష్ బాబు అభిమానులు. నేరుగా విమర్శించడం చేతకాకనే ఇలా సొల్లు కబుర్లు చెబుతున్నారంటూ ఫైర్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











