మహేష్ ఖలేజా వంద రోజులు ఒకే ఒక్క సెంటర్ వాళ్శు అభిమానులంటే
సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ మూడు సంవత్సరాలు ఎంతో కష్టపడి తీసినటువంటి సినిమా ఖలేజా. అభిమానులు అంచనాలు కొద్దిలో అందుకోలేకపోయిన మహేష్ ఖలేజా చిత్రం ఒకే ఒక్క సెంటర్‌లో వందరోజులు పూర్తి చేసుకుంది. మూడు సంవత్సరాలు కష్టపడి తీసిన తమ హీరో సినిమా ఒక్క సెంటర్ లోనైనా వందరోజులు ఆడకపోతే బాగుండదనే ఉద్దేశ్యంతో చిత్తూరు ప్రిన్స్ అభిమానులు ఈసినిమాని వందరోజులు ఆడించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
చిత్తూరు శ్రీనివాస ధియేటర్ లో మహేష్ ఖలేజా చిత్రాన్ని వంద రోజులు దిగ్విజయంగా పూర్తి చేయించారు. శతదినోత్సవం జరుపుకుంటున్న సినిమాలలో తమ అభిమాన హీరో ప్రిన్స్ సినిమా కూడా ఉండాలన్న ఉద్దేశ్యంతో మాత్రమే కాకుండా, ప్రిన్స్ ఎప్పుడూ సూపర్ స్టారే అంటూ 2010వ సంవత్సరం చివరలో వచ్చిన సినిమాలన్నింటిలో కెల్లా అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రం మహేష్ ఖలేజా అంటూ అభిమానలు సంబరాలు జరుపుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











