థియేటర్లపై మహేష్ అభిమానుల ‘దూకుడు’
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందిన 'దూకుడు" సినిమా రేపు(సెప్టెంబర్ 23) విడుదల కాబోతోంది. అయితే సినిమా విడుదలకు ఒక రోజు ముందే మహేష్ బాబు అభిమానులు థియేటర్లపై దూకారు. తమ అభిమాన హీరో సినిమాను తొలి రోజు చూడాలనే ఆతృతతో మంగళవారమే థియేటర్లపై దండెత్తారు. అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్ల కోసం పడిగాపులు మొదలు పెట్టారు. అభిమానుల తాకిడితో పలు థియేటర్లలో ఇబ్బందికర వాతావరణం ఏర్పడటంతో కొన్ని చోట్ల పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితి చక్కదిద్దారు.
అభిమానుల ఉత్సాహం ఇలా ఉంటే...దూకుడు సినిమా రిలీజ్ కన్ ఫర్మ్ కాలేదని, బాక్సులు వెనక్కి వెళ్లి పోయాయని, సినిమా విడుదల వాయిదా పడవచ్చనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పలు టీవీ చాన్సల్స్ లో వచ్చే ట్రైలర్స్ లో 23న విడుదల అనే విషయం కనిపించక పోవడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరినట్లవుతోంది. ఎక్కడా కూడా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించక పోవడంతో కొన్ని చోట్ల అభిమానులు ఆందోళనకు దిగారు.


Click it and Unblock the Notifications











