దూకుడు వివాదం: మహేష్ ఫ్యాన్స్ కోటి ఆఫర్
దూకుడు చిత్రం రికార్డుల గొడవ రోజు రోజుకీ ముదురుతోంది. రెండు రోజుల క్రితం చిరు అభిమానులు విజయవాడలో దూకుడు రికార్డులు కరెక్టే అని రుజువు చేస్తే లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేష్ అభిమానులు దీనిని సవాలు చేసారు. మగధీర రికార్డులుని దూకుడు క్రాస్ చేయలేదని నిరూపిస్తే కోటి రూపాయలు ఇస్తామని ప్రతిసవాల్ చేసారు. అంతేగాక దూకుడు నిర్మాత జిల్లావారి రికార్డులని ప్రకటించాలని డిమాండ్ చేసారు. విజయోత్సవ సభలో దూకుడు నిర్మాత.. దూకుడు నిర్మాతలను తిరిగ రాసిందని ప్రకటించటం వివాదానికి కారణమైంది. రికార్డులంటే మగధీరవే అంటూ అభిమానులు మండిపడుతున్నారు. విజయవాడ అలంకార్ సెంటర్లలో ఈ మేరకు వారు ప్లెక్లీలు పెట్టి వివాదాన్ని మొదలెట్టారు.
ఇంతవరకూ మగధీర రికార్డులను ఏ చిత్రమూ బీట్ చెయ్యలేదని వారు తేల్చి చెప్పారు. కానీ తప్పుడు ప్రకటనలతో దూకుడు నిర్మాతలు మోసం చేస్తున్నారని వారు అంటున్నారు. దమ్ముంటే వసూళ్లను పక్కాగా ప్రకటించాలని వారు అన్నారు. మెగా అభిమానులు ఏర్పాటు చేసిన ప్లెక్సీలలో ప్రాంతాల వారిగా మగధీర సాధించిన వసూళ్లు వివరాలు ఉన్నాయి. అలాగే ఎటువంటి చర్చకైనా సిద్దమేనని వారు అంటున్నారు. మరి చివరకు ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











