twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అరవింద్ ని, బన్ని ని...మహేష్ ఫ్యాన్స్ ఆడుకుంటున్నారు

    By Srikanya
    |

    హైదరాబాద్: నిన్నటి దాకా చెప్పను బ్రదర్ అన్న అల్లు అర్జున్ మాట ట్రెండింగ్ లో ఉంటే ఇప్పుడు అల్లు కుటుంబానికి మరొక తలనొప్పి వచ్చి పడింది. ఈ సారి మహేష్ ఫ్యాన్స్ కోపంతో అల్లు అరవింద్ ని ..చీప్ అల్లు పాలిటిక్స్ అంటూ హ్యాష్ ట్యాగ్ తో ట్రెండింగ్ చేస్తూ ట్విట్టర్ లో ఓ రేంజిలో ఆడుకుంటున్నారు.

    విషయం ఏమిటీ అంటే... తన కుమారుడు అల్లు అర్జున్ తాజా చిత్రం 'సరైనోడు' కోసమని ఉత్తరాంధ్రలో థియేటర్లను బ్లాక్ చేసి పెట్టారట అరవింద్. దీంతో 'బ్రహ్మోత్సవం' సినిమాకు అక్కడ సరిపడా థియేటర్లు దొరకట్లేదని మహేష్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

    దీంతో మహేష్ ఫ్యాన్స్ అంతా ట్విట్టర్ లో 'చీప్ అల్లు పాలిటిక్స్' అనే నెగెటివ్ ట్యాగ్ ట్రెండ్ చేస్తూ అరవింద్ మీద విరుచుకుపడుతున్నారు . థియేటర్ల బ్లాకింగ్ విషయంలో వాస్తవాలేంటో తెలియదు కానీ ..మహేష్ ఫ్యాన్స్ ఇలా ఓ రేంజిలో తీవ్ర స్దాయిలో మండిపడటం ఎవరూ ఊహించని పరిణామం.

    బ్రహ్మోత్సవం, సితార సెంటిమెంట్, నెక్ట్స్ ప్రాజెక్ట్...(మహేష్ ఇంటర్వ్యూ)బ్రహ్మోత్సవం, సితార సెంటిమెంట్, నెక్ట్స్ ప్రాజెక్ట్...(మహేష్ ఇంటర్వ్యూ)

    సాధారంగా గతంలో మామూలుగా ఇలాంటి నెగెటివ్ ట్యాగ్ ల ట్రెండింగ్స్ తమిళ చిత్ర పరిశ్రమలోనే ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్య తెలుగు సినీ పరిశ్రమకూ ఈ సంస్కృతి పెరుగుతోంది.

    ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ అంతా ఏకమై అల్లు అర్జున్ అన్న ఒక్క మాటను పట్టుకుని 'చెప్పను బ్రదర్' అనే హ్యాష్ ట్యాగ్ తో రచ్చ చేశారు. ఇప్పడు మహేష్ ఫ్యాన్స్ తగులుకుని అల్లు అరవింద్ ని, పనిలో పనిగా అల్లు అర్జున్ ని ఏకేస్తూ ట్విట్టర్ , ఫేస్ బుక్ లో ఓ స్దాయిలో పోస్ట్ లు పెడుతున్నారు.

    నాకు నచ్చలేదు, పవన్ కళ్యాణ్ తో సినిమా చేయను: పివిపినాకు నచ్చలేదు, పవన్ కళ్యాణ్ తో సినిమా చేయను: పివిపి

    'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తర్వాత శ్రీకాంత్ అడ్డాల, మహేశ్ కాంబినేషన్‌లో రూపొందిన 'బ్రహ్మోత్సవం' ఈనెల 20న విడుదలకు సిద్ధమైంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న చిత్రం సోమవారం సెన్సార్ పూర్తిచేసుకుని క్లీన్ 'యు' సర్టిఫికేట్ పొందింది.

    స్లైడ్ షో లో చీప్ అల్లు పాలిటిక్స్ అంటూ ట్యాగ్ చేస్తూ పెట్టిన ఫొటోలు చూడండి, పివిపి అధినేత పొట్లూరి వరప్రసాద్ ఇంటర్వూతో

    కొత్త తలనొప్పి

    కొత్త తలనొప్పి

    అల్లు అరవింద్ కు ఈ పరిణామం ఊహించని తలనొప్పే

    ధియోటర్స్ చేతిలో ఉన్నాయనే

    ధియోటర్స్ చేతిలో ఉన్నాయనే

    అల్లు అరవింద్ తన చేతిలో ధియేటర్స్ పెట్టుకుని ఇలా చేస్తున్నాడని అంటున్నారు

    పవన్ ఫ్యాన్స్ సపోర్ట్

    పవన్ ఫ్యాన్స్ సపోర్ట్

    ఈ వివాదానికి పవన్ ఫ్యాన్స్ నుంచి కూడా సపోర్ట్ లభిస్తోంది

    బిజినెస్

    బిజినెస్

    అయితే ఇందులో తప్పేముంది సినిమా బిజినెస్ అనేవాళ్లు లేకపోలేదు

    నిజమెంత

    నిజమెంత

    ఎన్ని ధియేటర్స్, ఏయే ఏరియాల్లో బ్లాక్ చేసారో లిస్ట్ ఇస్తే ఇంకా బాగుండేది అని కొందరంటున్నారు

    ప్లస్ అవుతుందా

    ప్లస్ అవుతుందా

    ఈ నెగిటివ్ పబ్లిసిటీ సరైనోడు కు ప్లస్ అయ్యే అవకాసం ఉందంటున్నారు.

    సరికొత్త రికార్డ్

    సరికొత్త రికార్డ్

    విడుదల తర్వాత రికార్డుల మాట అలా ఉంచితే విడుదలకు ముందే ఈ చిత్రం శాటిలైట్ హక్కులు పరంగా సరికొత్త రికార్డును దక్కించుకుంది.

    బ్రద్దలు కొట్టింది

    బ్రద్దలు కొట్టింది

    మహేష్ గత సంచలన చిత్రం 'శ్రీమంతుడు' శాటిలైట్ రికార్డును 'బ్రహ్మోత్సవం' బద్దలు కొట్టింది.

    ఎంతకంటే

    ఎంతకంటే

    11.20 కోట్ల రూపాయలకు ఈ చిత్రం శాటిలైట్ హక్కులను 'జీ తెలుగు' సొంతం చేసుకుంది.

    బాహుబలి తర్వాత

    బాహుబలి తర్వాత

    ఇంత భారీ మొత్తానికి శాటిలైట్ అమ్మకాలు జరిగిన చిత్రాల్లో 'బాహుబలి' తర్వాత స్థానం ఈ చిత్రానికే దక్కడం మరో విశేషం అంటున్నారు సినీజనం.

    ఉత్సుకత

    ఉత్సుకత

    ఇప్పటికే 'బ్రహ్మోత్సవం' పై భారీ అంచనాలు పరిశ్రమలో నెలకొని ఉండగా... ఈ చిత్రంలో మహేష్‌బాబు క్యారెక్టర్‌కు ఎలాంటి పేరూ ఉండదంటూ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చెప్పడం ఆడియోన్స్‌లోనూ ఉత్సుకత పెంచుతోంది.

    ప్రత్యేకత

    ప్రత్యేకత

    మహేష్‌బాబు క్యారెక్టరే ఓ హైలైట్...ఇంకా ఆయన పాత్రకు పేరెందుకని దర్శకుడు చెబుతున్నారంటే ఏదో ప్రత్యేకత ఉండి తీరుతుందంటున్నారు ప్రిన్స్ ఫ్యాన్స్.

    ముందుగానే

    ముందుగానే

    శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ఓవర్‌సీస్‌లో మాత్రం ఒకరోజు ముందుగా ప్రీమీయర్‌గా చూపబోతున్నారు.

    ఇదీ రికార్డే

    ఇదీ రికార్డే

    ఒక్క అమెరికాలోనే 'బ్రహ్మోత్సవం' చిత్రం 250 స్క్రీన్లలో ప్రదర్శించనున్నారు.

    ప్రీ ప్రొడక్షన్

    ప్రీ ప్రొడక్షన్

    ‘బ్రహ్మోత్సవం' కథ విన్నాక ఏదో నమ్మకం ఏర్పడింది. అందుకే రెండేళ్లు ప్రీ ప్రొడక్షన్ మీద కూర్చుని సినిమా తీశాం అంటున్నారు నిర్మాత

    నా లైఫ్ నాకే

    నా లైఫ్ నాకే

    ఈ కథ విన్నప్పుడు నా లైఫ్‌ నాకే కనిపించింది. నాకే కాదు సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరిది అదే ఫీలింగ్‌.

    రిలీజ్ అయ్యాక చెప్తాను

    రిలీజ్ అయ్యాక చెప్తాను

    ఇందులో ఓ పాయింట్‌ మాత్రం వ్యక్తిగతంగా నాకు బాగా కనెక్ట్‌ అయింది. అదేంటనేది సినిమా విడుదలయ్యాక చెప్తాను అన్నారు నిర్మాత

    ఎందుకు చూడాలంటే

    ఎందుకు చూడాలంటే

    ‘బ్రహ్మోత్సవం' ఎందుకు చూడాలి అంటే అందుకు నా సమాధానం ఒకటే. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మంచి హృదయంతో బయటికొస్తారు.

    మరింత అందం

    మరింత అందం

    మహేశ్ ఛార్మింగ్‌, శ్రీకాంత్ అడ్డాల టేకింగ్‌, సాంకేతిక నిపుణుల పనితనం సినిమాకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి.

    నిజ జీవితాలు

    నిజ జీవితాలు

    ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు' నా ఫేవరెట్‌ సినిమా. శ్రీకాంత్ అడ్డాల కథలన్నీ నిజ జీవితాల ఆధారంగా ఉంటాయి. ఈ సినిమా కూడా ఆ తరహాకు చెందిందే.

    అదే తేడా

    అదే తేడా

    కానీ ఆ సినిమాకు, దీనికి చిన్న భేదం ఉంది. ఓ ఫ్యామిలీ కథని సినిమాటిక్‌గా మలచి రూపొందించారు శ్రీకాంత్ అడ్డాల.

    రెండు కళ్లూ

    రెండు కళ్లూ

    ఒకప్పుడు ఎన్టీఆర్‌గారిని తెర మీద చూడటానికి రెండు కళ్ళు సరిపోయేవి కాదని అనేవారు. ఈ సినిమాలో మహేశ్‌ని చూడడానికి రెండు కళ్లు సరిపోవు.

    మళ్లీ చేస్తాం

    మళ్లీ చేస్తాం

    మహేశ్‌తో మళ్లీ సినిమా చెయ్యాలనుంది. మా దగ్గర మంచి కథలు సిద్ధంగా ఉన్నాయి. ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తా.

    అన్ని దగ్గరుండే

    అన్ని దగ్గరుండే

    ‘బ్రహ్మోత్సవం' సినిమా ప్రారంభం నుంచి రిలీజ్‌ డేట్‌ వరకు అన్నీ దగ్గరుండి చూసుకున్నా.

    ఎంతో ఫ్యాషన్ గా

    ఎంతో ఫ్యాషన్ గా

    గత రెండేళ్లగా ప్రొడక్షన్ మీద చాలా దృష్టి పెట్టాను. ఈ సినిమా కోసం మరింత ప్యాషన్‌తో పనిచేశా.

    గర్వించే

    గర్వించే

    ఇకపై సంస్థ గర్వించే సినిమాలే తీస్తా. నిర్మాతకి విలువిచ్చే వారితోనే సినిమాలు తీస్తా.

    ధైవాధీనం

    ధైవాధీనం

    నాణ్యమైన సినిమా తీయడం వరకే మన చేతిలో ఉంది. సక్సెస్‌ ఫెయిల్యూర్‌ దైవాధీనం.

    కన్విక్షన్

    కన్విక్షన్

    ఏ పనిచేసినా అందులో ఎక్స్‌లెన్స్, ప్యాషన్ అనేది చాలా ముఖ్యం. ఏ పని చేసినా కన్విక్షన్ ఉండాలి. తెలిసి తప్పు చేయకూడదు.

    ఎత్తుపల్లాలు చూసా

    ఎత్తుపల్లాలు చూసా

    జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాను. కష్టాలతో అమెరికా వెళ్లా. ఓ స్థాయికొచ్చా.

    అందుకే అమెరికా అంటే గౌరవం

    అందుకే అమెరికా అంటే గౌరవం

    ఒకరిని తక్కువగా చూసే విధానం అక్కడలేదు. అక్కడ అందరినీ ఒకేలా చూస్తారు. మనదేశంలో అదే లేదు. అందుకే అమెరికాను గౌరవిస్తా.

    English summary
    Mahesh Babu fans are trolling Bunny in the social blogging site by trending #CheapAlluPolitics. Mahesh fans claim that, Allu Arjun and his father Allu Aravind have blocked theaters in Telugu states for Sarainodu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X