మహేష్ బాబు దూకుడు ఎంతవరకూ వచ్చింది? (లేటెస్ట్ ఇన్ఫో)

By Srikanya

మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం దూకుడు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలి లోని అల్యూమినియం ప్యాక్టరీలో జరుగుతోంది.ఇక్కడ యాక్షన్ ఎపిసోడ్స్ తీస్తున్నారు.మరో ఐదురోజుల పాటు ఇక్కడే షూటింగ్ జరగనుంది.ఈ చిత్రం షూటింగ్ ని త్వరగా పూర్తిచేసి ఆగస్టులో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.ఇక ఈ చిత్రం కామిడీ ఎంటర్టైనర్ గా సాగుతూ యాక్షన్ అండర్ కరెంట్ గా ఉంటుందంటున్నారు.

అలాగే ఈ సినిమాలో మహేష్ పోలీస్ ఇన్ఫార్మర్ గా కనిపించనున్నాడని,సమంత అతన్ని ప్రేమించే అమ్మాయిగా గ్లామర్ ని పండించనున్నది.తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంకి చెందిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, ప్రోమోలు రీసెంట్ గా విడుదల అయి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవటంతో బిజెనెస్ పరంగానూ ఈ సినిమాకు మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.అందులోనూ దాదాపు మూడు సంవత్సరాల పాటు వెయిటింగ్ తర్వాత విడుదలైన ఖలేజా చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అవటంతో మహేష్ కి సైతం ఈ సినిమా కీలకంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X