ఆగస్టులో ‘దూకుడు’ విడుదలకు ఫైట్ చేస్తున్న మహేష్...
షూటింగ్ నిమిత్తం స్విట్జర్లాండ్ లో ఉన్న మహేష్ బాబు పోరాట సన్నివేశాల చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నాడు. 'దూకుడు' చిత్రానికి సంబందించిన తాజా షెడ్యూల్ స్విట్జార్లాండ్ లో జరుగుతుంది. అక్కడ ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. ఐదు రోజుల క్రితం మొదలైన ఈ షెడ్యూల్ లో మొదట దినేష్ మాస్టర్ నేతృత్వంలో ఒక పాట షూటింగ్ పూర్తి చేసినట్టు తెలుస్తుంది.
సమంతా మహేష్ తో జోడి కడుతున్న ఈ చిత్రాన్ని కృష్ణ ప్రొడక్షన్స్ సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ఫై అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి చంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ నెల 26వరకూ ఈ చిత్రం షూటింగ్ అక్కడే జరుగుతుందట. ఇదిలా ఉంటే ఈ చిత్రం ఆడియోను జూలై 10న విడుదల చేసి, సినిమాని ఆగస్ట్12న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. యాక్షన్ ఓరియంటెడ్ చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి శ్రీను వైట్ల మార్క్ కామెడీ, యాక్షన్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











