మహేష్ చిత్రం టైటిల్ ‘యోహన్’ కాదు: గౌతం మీనన్
హైదరాబాద్: మహేష్ బాబు-గౌతం మీనన్ కాంబినేషన్లో రూపొందుతున్న త్రిబాషా చిత్రం(తెలుగు, తమిళం, హింది) చిత్రం టైటిల్ 'యోహాన్' కాదు. దర్శకుడు గౌతం మీనన్ ఈ విషయమై మాట్లాడుతూ ఈ చిత్రం టైటిల్ 'యోహాన్' కాదని, అది కేవలం పుకారే అని స్పష్టం చేసారు. స్క్రిప్టు పూర్తయిన తర్వాత టైటిల్ తో పాటు అన్ని వివరాలు వెల్లడిస్తానని గౌతం మీనన్ తెలిపారు.
వాస్తవానికి గౌతం మీనన్ తమిళ స్టార్ హీరో విజయ్‌తో ఈచిత్రాన్ని తొలుత ప్లాన్ చేసారు. అయితే కొన్ని కారణాల వల్ల విజయ్‌తో ఆ ప్రాజెక్టును రద్దు చేసుకుని మహేష్ బాబుతో చేయడానికి రెడీ అయ్యారు గౌతం మీనన్. త్వరలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
ప్రస్తుతం మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఇటీవలే ఈచిత్రం గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుంది. మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రొమాంటిక్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపుపొందిన సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు తొలిసారిగా నటిస్తున్నారు.
మరో వైపు మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. డిసెంబర్ నెలలో ఈచిత్రం విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











