ఆ రహస్యం అభిమానులకు తెలుసు!
రోజు రోజుకు తనలో గ్లామర్ పెరుగుతుంది ఎందుకో అభిమానులకు తెలుసు అన్నాడు ప్రిన్స్ మహేష్ బాబు. సికింద్రాబాద్ లో రెయిన్ బో పిల్లల ఆసుపత్రిని బుధవారం భార్య నమ్రతతో వచ్చిన మహేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రోజురోజుకు తన గ్లామర్ ఎందుకు పెరుగుతోందో అభిమానులకు తెలుసన్నారు. కొంతకాలం పాటు తాను విశ్రాంతి తీసుకోనున్నందున ఇంకా తన తదుపరి సినిమా గురించి ఆలోచించడం లేదని ఆయన స్పష్టం చేశారు. తన కొడుకు గౌతమ్ కు రెయిన్ బో ఆసుపత్రి చక్కని వైద్యాన్ని అందించడం మూలంగానే ఆయన ఆసుపత్రితో తన సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఈ ఆసుపత్రికే తను కొంత డబ్బును కూడా తను ప్రారంభించిన చారిటీ ద్వారా అందించారు.


Click it and Unblock the Notifications











