మహేష్ కోరిక పూర్తి స్థాయి అమల్లో పెట్టబోతున్నాడు..!
2013 వేసవి వరకూ మహేష్ బాబు ఫుల్ బిజీగా ఉండబోతున్నాడు. 'ఖలేజా"కి ముందు వచ్చిన గ్యాప్ కవర్ చేసుకునేందుకు మహేష్ ఇప్పుడు వేగంగా సినిమాలు చేస్తున్నాడు. దూకుడు" తర్వాత చేయబోయే మూడు సినిమాలని మహేష్ అప్పుడే ఓకే చేశాడు. దూకుడు షూటింగ్ అయిందో లేదో బిజినెస్ మ్యాన్ షూటింగ్ మొదలు పెట్టిన మహేష్ ఈ చిత్రాన్ని నాలుగే నెలల్లో పూర్తి చేస్తూ రికార్డు సృష్టించాడు.
దిల్ రాజు బ్యానర్ లో వెంకటేష్ తో కలిసి మహేష్ నటించే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నవిషయం విధితమే. మహేష్ వెంకటేష్ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుంటే, సుకుమార్ సినిమాని 'దూకుడు" నిర్మాతలు నిర్మించనున్నారు.
ఏడాదికి రెండు సినిమాలైనా విడుదల చేయాలనే మహేష్ కోరిక, ఫ్యాన్ కు ఇచ్చిన మాట 2012 నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది. వచ్చే ఏడాది బిజినెస్ మ్యాన్ తో పాటు సీతమ్మ వాకిట్లో..సినిమాలు విడుదల కావడం తధ్యం. సుకుమార్ సినిమా 2013సంక్రాంతికి రెడీ కావచ్చు. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడని అంటున్నారు.


Click it and Unblock the Notifications











