మహేష్ ‘ఆగడు’లో హీరోయిన్ ఎవరు?

By Bojja Kumar

హైదరాబాద్ : 'బాద్ షా' చిత్రంతో హిట్ కొట్టిన శ్రీను వైట్ల తర్వాత మహేష్ బాబుతో 'ఆగడు' సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు-సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా పూర్తయిన తర్వాత 'ఆగడు' సినిమా సెట్ప్ పైకి రానుంది.

కాగా...ఆగడు సినిమాలో మహేష్ బాబుతో రొమాన్స్ చేసే హీరోయిన్ ఎవరు? అనే విషయమై ఫిల్మ్ నగర్లో చర్చ మొదలైంది. దర్శకుడు శ్రీను వైట్ల ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతి హాసన్‌ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడని ఇండస్ట్రీ టాక్. త్వరలో ఈ విషయమై ఓ క్లారిటీ రానుంది.

గతంలో బిజినెస్ మేన్ సినిమా సమయంలోనే మహేష్ బాబుతో నటించే అవకాశం వచ్చినప్పటికీ అనుకోని కారణాలతో ఆ అవకాశం చేజార్చుకున్న శృతి హాసన్ ఈ సారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరుగకుండా డేట్స్ విషయలో జాగ్రత్త పడుతోంది.
దూకుడు సినిమాను మహేష్ బాబు ఇమేజ్‌కు తగిన విధంగా పూర్తి స్థాయి కమర్షియల్ అంశాలతో వినోదాత్మకంగా రూపొందించిన శ్రీను వైట్ల....'ఆగడు' స్క్రిప్టు తన గత సినిమాలకు వైవిధ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ఇంతకాలం శ్రీను వైట్లతో కలిసి పని చేసిన గోపీ మోహన్, కోన వెంకట్ సొంతగా దర్శకత్వం వైపు అడుగులు వేయడంతో.... 'ఆగడు' సినిమాకు సొంతగా స్క్రిప్టు రాసుకునే పనిలో ఉన్నాడట శ్రీను వైట్ల. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో 'దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో 'ఆగడు' సినిమా చేయడానికి రెడీ కావడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X