అంటున్నారు అభిమానులు. మహేష్ బాబు తాజాగా గోవాకి హాలిడేస్ కి ఫ్యామిలీతో వెళ్ళాడని తెలిసి అంతా నిట్టూరుస్తూ అలా అంటున్నారు. అతిధి అనంతరం త్రివిక్రమ్ సినిమా చేయటానికి చాలా గ్యాప్ తీసుకోవటం వారిని అసహనానికి గురిచేస్తోంది. అయితే అతడు లాంటి హిట్ పడాలంటే ఆ మాత్రం హోమ్ వర్క్ అవసమే అనే వారూ ఉన్నారు. ఇక రేపూ మాపూ అనుకుంటూ తడవకో కారణంతో షూటింగ్ ని వాయిదా వేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ సారి సెట్ సరిగ్గా రాలేదంటూ..మళ్ళీ మార్పులు చేర్పులు అవసరం అంటూ మహేష్ ని ఒప్పించాడు. ఇలా అయితే ఎప్పటికి సినిమా పూర్తయ్యేను...ఎప్పుడు రిలీజ్ అయ్యేను అనేది వారి బాధ. అర్ధం చేసుకోవచ్చుకదా..