పవన్ ని ఇమిటేట్ చేస్తున్న మహేష్ బాబు? (ఫోటో)
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ ని మహేష్ బాబు ఇమిటేట్ చేస్తున్నాడా... ఈ ఫోటో చూసిన వారు అవును.. అలాగే ఉంది అంటున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆడియో ఫంక్షన్ సమయంలో తీసిన ఈ ఫోటో ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో తెగ తిరుగుతోంది. పవన్ ని ఇమిటేట్ చేస్తున్న మహేష్ అంటూ కాప్షన్ తో.. ఈ ఫోటో ప్రచారంలోకి వచ్చింది. మెడపై..అచ్చం పవన్ పెట్టుకునే విధంగా చెయ్యి పెట్టుకోవటం ఈ ఫోటో లో స్పెషల్ గా చెప్తున్నారు. గబ్బర్ సింగ్ రేంజిలో హిట్ కొట్టడానికే మహేష్ ఇలా ఓ రేంజిలో సిద్దమవుతున్నట్లుగా అబిమానంతో అంటున్నారు.
ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం ఈ సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రం గురించి మహేష్ మాట్లాడుతూ... "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం కచ్చితంగా నా అభిమానులకు, వెంకటేష్ గారి అభిమానులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. సినిమా చూసి థియోటర్ నుంచి బయిటకు వచ్చే మొహాల్లో సంతోషం కనపడుతుంది. మంచి సినిమా చూసామన్న తృప్తిని ఈ సినిమా ఇస్తుంది.. నా కెరీర్లో ఏ సినిమా ఇంతలా ఇష్టపడి చేయలేదు" అంటున్నారు మహేష్ బాబు.
వెంకటేష్, మహేష్‌బాబు హీరోలుగా దిల్ రాజు నిర్మిస్తున్న మల్టీస్టారర్ చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జనవరి 11,2013 సంక్రాంతి కానుకగా ఈ కుటుంబ కధా చిత్రం విడుదల అవుతోంది. మిక్కీ జే మేయర్ అందించే సంగీతం సినిమాకు ప్లస్ అవుతుందని చెప్తున్నారు.
సమంత, అంజలి, ప్రకాష్ రాజ్, జయసుధ, రోహిణిహట్టంగడి, రావు రమేష్, ఆహుతిప్రసాద్, బ్రహ్మానందం, రమాప్రభ, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, రవిబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీజెమేయర్, కెమెరా: కె.వి.గుహన్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్, నిర్మాత: దిల్‌రాజు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.


Click it and Unblock the Notifications











