చెన్నైలో సైనికుడు మహేష్ ఫైట్స్
పోకిరి ఘన విజయం సాధించడంతో మహేష్‌బాబు బాధ్యత పెరిగింది. ఆయన అదే పట్టుదలతో సైనికుడు సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. జెమినీ ఫ్లైవోవర్ వద్దగల ఒక భవనం పై భాగంపై భీకర ఫైట్ సన్నివేశాలను మహేష్‌బాబుపై చిత్రీకరిస్తున్నారు. మహేష్ పోకిరి దాదాపు 40 కోట్లు వసూలు చేయగలదని అంచనా. ఇది డెబ్బై ఐదేళ్ళ తెలుగు సినిమా చరిత్రలో ఒక రికార్డు కాబోతోంది. తమిళనాడు, కర్నాటకలో కూడా పోకిరి వసూళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాయి. చెన్నై జయప్రద థియేటర్‌లో ఈ సినిమా శతదినోత్సవం జరుపుకోబోతోంది.


Click it and Unblock the Notifications