ఫిల్మ్ నగర్ లో హాట్ గా చుట్టు తిరుగుతున్న న్యూస్...మహేష్ బాబు కూడా సిక్స్ ప్యాక్ బాడీ క్లబ్ లో జాయిన్ అయ్యాడని. అందుకనే అతను పుట్టిన రోజు మినహా మిగతా రోజుల్లో ఎవరికీ కనపడటం లేదని చెప్పుకుంటున్నారు. ఈ మధ్య అందరు హీరోలు సిక్స్ ప్యాక్ తో రెచ్చిపోతుంటే తను మాత్రం ఏం తక్కువ తిన్నానన్నట్లుగా ఈ డెషిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హాలీవుడ్ హీరోలా స్టైల్ గా ఉండే అతను ఈ సారి స్క్రీన్ పై మరింత డిఫెరెన్స్ చూపాలని నిర్ణయించుకున్నాడని చెప్పుకుంటున్నారు. అందుకే షూటింగ్ వాయిదాలు మీద వాయిదాలు వేయిటం జరిగిందని సమాచారం. అంటే ఈ వార్త రూమర్ కాకపోతే మహేష్ తన సిక్స్ పాక్ బాడీని వరుడు సినిమాలో ప్రదర్శించనున్నాడన్న మాట. అంటే బాలీవుడ్ ,కోలీవుడ్ అన్న తేడా లేకుండా పాకుతున్నఈ సిక్స్ పాక్ పిచ్చి మహేష్ కి కూడా పట్టిందని కొందరు అంటున్నారు.