»   » కొనేసారు: మహేష్ బాబుకు 25 కోట్లు, కొరటాల శివకు 14 కోట్లు!

కొనేసారు: మహేష్ బాబుకు 25 కోట్లు, కొరటాల శివకు 14 కోట్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా రంగం ఇపుడు అంతా హిట్ కాంబినేషన్ల చుట్టే తిరుగుతుంది. నిర్మాతలందు కేవలం కాంబినేషన్లు నమ్మి సినిమాలు తీసే నిర్మాతలు వేరయా? అనే రకం ఉంటారు. ఒక స్టార్ హీరో లేదా స్టార్ డైరెక్టర్ హిట్టు కొట్టాడంటే వారితో సినిమాలు చేయడానికి ఇలాంటి రకం నిర్మాతలు క్యూ కడుతుంటారు. వారి డేట్స్ దక్కించుకోవడానికి కోట్లు గుమ్మరిస్తారు.

'శ్రీమంతుడు' సినిమా భారీ హిట్టఅయి ఇండస్ట్రీలో బాహుబలి తర్వాతి అతి పెద్ద హిట్ కావడంతో మహేష్ బాబు-కొరటాల శివ కాంబినేషన్ కు బాగా క్రేజ్ వచ్చింది. ఇపుడు ఈ కాంబినేషన్ ను నమ్ముకుని నిర్మాత డివివి దానయ్య భారీగా ఖర్చు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు డేట్లను రూ. 25 కోట్ల దానయ్య సొంతం చేసుకున్నారని టాక్. అదే విధంగా దర్శకుడు కొరటాల శివకు రూ. 14 కోట్లు రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసి మహేష్ బాబుతో సినిమా చేసేందుకు ఒప్పించాడట.

ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ కూడా ఇంత పెద్ద మొత్తం రెమ్యూనరేషన్ గా అందుకోలేదు. ఇదే నిజమైతే కొరటాల శివ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసినట్లే అని అంటున్నారు. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు..

ఈ ఇద్దరికే 39 కోట్లు

ఈ ఇద్దరికే 39 కోట్లు


హీరో, డైరెక్టర్ కు కలిపి సినిమా బడ్జెట్ లో రూ. 39 కోట్లు పోతే మరి సినిమా బడ్జెట్ ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

కనీసం 40 కోట్లు

కనీసం 40 కోట్లు


మహేష్ బాబు లాంటి హీరోతో సినిమా అంటే ఇతర నటీనటులు, టెక్నీషియన్స్, ప్రొడక్షన్ ఖర్చు కనీసం 40 కోట్లు అవుతుందని అంచనా.

మినిమమ్ బిజినెస్

మినిమమ్ బిజినెస్


ఇంత భారీ సినిమా అంటే సినిమా రిలీజ్ ముందే రూ. 80 కోట్లు కనీస బిజినెస్ చేస్తే తప్ప నిర్మాత బ్రేక్ ఈవెన్ పాయింటు(లాభనష్టాలు లేని పాయింట్) ను చేరుకోలేదు.

లాభం రావాలంటే

లాభం రావాలంటే


80కోట్ల పెట్టుబడి పెట్టిన దగ్గర కనీసం 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తేనే 20 కోట్లు లాభం శచ్చే అవకాశం ఉంది.

డిస్ట్రిబ్యూటర్లు కూడా లాభపడాలంటే..

డిస్ట్రిబ్యూటర్లు కూడా లాభపడాలంటే..


డిస్ట్రిబ్యూటర్లు కూడా లాభ పడాలంటే ఈ కాంబినేషన్ సినిమా కనీసం 120 కోట్ల బిజినెస్ చేయాల్సి ఉంటుంది.

Read more about: mahesh babu, koratala siva
English summary
As per the buzz, Mahesh is going to get 25C for his upcoming film in the direction of Koratala Siva. The star director too is going to get a hefty paycheck, they claim.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu