శంకర్స్ 3 ఇడియట్స్ లో మహేష్ ఒక్కడు...
శంకర్ దాదా జిందాబాద్..అలాగే శంకర్ దాదా యమ్ బిబియస్..వంటి రీమేక్ చిత్రాలను నిర్మించి..విజయవంతం అయిన జెమిని ఫిలిం సర్క్యూట్ సంస్థ..బాలీవుడ్ లో భారీ విజయం సాధించిన '3 ఇడియట్స్" చిత్ర రీమేక్ హక్కులను సొంతం చేసుకుందని గత కొన్ని నెలల క్రితమే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే..తాజాగా వచ్చిన మరో విషయం ఏమిటంటే..ఈ చిత్రం రీమేక్ బాధ్యతలను డైరక్టర్ శంకర్ చేతుల్లో పెట్టినట్లుగా సమాచారం...
శంకర్ చేతులోనికి ఈ చిత్రం వెళ్ళిందని వార్తలు రావడంతో..బాలీవుడ్ కథకి..టాలీవుడ్ కథకి ..భారీ మార్సులు ఉంటాయని..ఇప్పటికే వార్తలు సంచరిస్తున్నాయి. శంకర్..సూపర్ స్టార్ రజనీకాంత్-ఐశ్వర్య రాయ్ తో రూపొందించిన 'రోబో" నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే..ఈ చిత్రం తర్వాత శంకర్ చేస్తున్న హిందీ బ్లాక్ బస్టర్ చిత్రం '3 ఇడియంట్స్" రీమేక్ కావడం విశేషం అలాగే తొలిసారిగా శంకర్ చేస్తున్న రీమేక్ చిత్రం కూడా ఇదే కావడం విశేషం. ఈ చిత్రాన్ని ఒక్కే సారి తెలుగు, తమిళంలో స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ అమీర్ ఖాన్ పాత్ర పోషిస్తున్నట్టు వచ్చిన వార్తలు తెలిసిందే.
కాగా తాజాగా మహేష్ బాబు జెమిని ఫిల్మిం సర్క్యూట్ తో అప్రోచ్ అయి తను కూడా అందులో నటించేందుకు అంగీకరించినట్టు సమాచారం. ఇదే కనుక నిజమైత మహేష్ అభిమానులకు పండేగే పండుగ. ఇప్పటికే '3ఇడియట్స్" చిత్రాన్ని అతిగా చూసిన వారు కూడా..శంకర్ చేతులలో సరికొత్తగా రూపుదిద్దుకుంటుందని వార్తలు రావడంతో ..శంకర్ ఎటువంటి హంగులు లేని ఈ బాలీవుడ్ చిత్రానికి..శంకర్ ఎటువంటి గ్రాఫిక్స్ చేయనున్నాడో అనే ఆత్రుత అప్పుడే మొదలవ్వడం మరో విశేషం.


Click it and Unblock the Notifications











