మహేశ్‌బాబుకు పుత్రోదయం
అతడు, పోకిరి చిత్రాల వరుస విజయాలతో ఆనందంలో మునిగి ఉన్న హీరో మహేశ్‌బాబు తండ్రయ్యారు. ఆయన సతీమణి నమ్రత గురువారం ఆగస్ట్ 31న హైదరాబాద్‌లోని గ్లోబల్ హాస్పిటల్స్‌లో మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆ దంపతులిద్దరికీ ఇదే తొలి సంతానం. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్య వర్గాలు వెల్లడించారు.
వంశీ చిత్రంలో జంటగా నటించిన మహేశ్, నమ్రత మధ్య అంకురించిన ప్రేమకథ .. అనేక మలుపులు తిరిగి చివరికి పెళ్లితో సుఖాంతం అయింది. ప్రిన్స్ మహేశ్‌బాబు ప్రస్తుతం సైనికుడు చిత్రం షూటింగ్‌లో తలమునకలై ఉన్నారు.


Click it and Unblock the Notifications