మహేష్ సూపర్ స్టార్, నేను హాఫ్ స్టార్ ను కూడా కాదు
హైదరాబాద్ : వరుణ్ సందేశ్ తనను మహేష్ బాబుతో పోల్చవద్దని చెప్తున్నారు. తను హాఫ్ స్టార్ కూడా కాదని అంటున్నాడు. వరుణ్ సందేశ్ తన తాజా చిత్రం పడ్డానండి ప్రేమలో మరి ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు.
వరుణ్ సందేశ్, వితిక షేరు జంటగా నటించిన సినిమా ‘పడ్డానండీ ప్రేమలో మరి'. మహేష్ ఉప్పుటూరి దర్శకత్వం వహిస్తున్నారు. పాంచజన్య ప్రై. లిమిటెడ్ పతాకంపై రూపొందుతోంది. నల్లపాటి వంశీమోహన్ సమర్పిస్తున్నారు.
నిర్మాత నల్లపాటి రామచంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘‘మా సినిమాను ఫిబ్రవరి 14న విడుదల చేస్తాం. సెన్సార్ క్లీన్ యు ఇచ్చింది. ఆడియోకి, ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది'' అని తెలిపారు.

పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్ అని హీరో చెప్పారు. శ్రావణి అనే పాత్రలో నటించినట్టు వితిక షేరు తెలిపారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అని, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించామని దర్శకుడు మహేష్ ఉప్పుటూరి తెలిపారు.
అరవింద్, పోసాని కృష్ణమురళి, తా.రమేష్, ఎం.ఎస్.నారాయణ, తె.శకుంతల, రక్ష, కాశీవిశ్వనాధ్, పృధ్వి, అనంత్, నల్లవేణు, అరుణ్‌కుమార్, చంటి, సంధ్యాజనక్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: విజయ రామప్రసాద్ వేప, కెమెరా: భరణి కె.్ధరన్, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, పాటలు: చైతన్యప్రసాద్, నిర్మాత: నల్లపాటి రామచంద్ర ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మహేష్ ఉప్పుటూరి.


Click it and Unblock the Notifications











