దేశంలోనే మహేష్‌లాంటి హీరో లేడు
''దాసరిగారు తెలుగులో మహేష్ అంత యాక్టర్ లేడని అన్నారు. కానీ ఇండియాలో లేరని నేనంటాను'' అని రామ్‌గోపాల్‌వర్మ చెప్పారు. 'బిజినెస్‌మేన్' హెక్సా ప్లాటినమ్ వేడుకను హైదరాబాద్‌లో సోమవారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గెస్ట్ గా హాజరైన రామ్ గోపాల్ వర్మ పై విధంగా స్పందించారు. ఇంతకు ముందు అమితాబ్ బచ్చన్ మించిన నటుడు లేడని చెప్పారుగా? అని మీడియావారు ప్రశ్నిస్తే ''మహేష్ ..వంద శాతం అమితాబ్‌ని మించిన నటుడు'' అన్నారు. మీరు మహేష్‌తో సినిమా చేస్తారా? అని అడిగితే ''ఆయన మంచి ఫామ్‌లో ఉన్నారు. అది చెడగొట్టడం నాకిష్టం లేదు ''అని నవ్వేశారు.
అలాగే ''ఈ సినిమా కథకి నా ఆలోచన కారణం అని పూరి చెప్పడం ఆనందంగా ఉంది. ఆ ఆలోచనని ఇలా కూడా తెరకెక్కించొచ్చా అని ఈ సినిమా చూశాక తెలిసింది అన్నారు. మహేష్ మాట్లాడుతూ.... ''సెప్టెంబర్ 23 నుంచి నాకు ఒక కలలాగా ఉంది. నా అభిమానులు కూడా అలాగే ఉన్నారు. వరుసగా బ్లాక్‌బాస్టర్లు వస్తున్నాయి. ఈ సినిమా ఇంత హిట్ అవ్వడానికి నిర్మాత వెంకట్‌గారి రాజీలేనితనమే కారణం. పూరి ఎంతో ఫైర్‌తో డైలాగులు రాశారు. ఆ డైలాగుల్లో నిజం ఉందని నమ్మాను కాబట్టే అంత బాగా చేశాను'' అని అన్నారు. ఆదిశేషగిరిరావు, కె.అచ్చిరెడ్డి, కాజల్ అగర్వాల్, తమన్, దిల్‌రాజు, సురేష్‌రెడ్డి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











