హాట్ న్యూస్ :మహేష్ బాబు కుమారుడు సినీ ఎంట్రీ ఖరారు
హైదరాబాద్ : లిటిల్ సూపర్‌స్టార్ ఆగమనానికి రంగం సిద్ధమవుతోంది. ఘట్టమనేని కుటుంబం నుంచి మరో నటుడు తెరపైకి రాబోతున్నాడు. మహేష్‌బాబు కుమారుడు గౌతమ్‌కృష్ణ ఓ చిత్రంలో నటించబోతున్నాడు. శనివారం హైదరాబాద్‌లో చిన్నారి గౌతమ్‌పై కొన్ని సన్నివేశాలు చిత్రించారు.
ఆ సమయంలో సెట్లో మహేష్, నమ్రత ఉండి... తమ కుమారుడి సందడిని తిలకించారు. ఇది ట్రయల్ షూట్‌లో భాగమని సమాచారం. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ మహేష్‌బాబు కథానాయకుడిగా ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. కృతి సనన్ కథానాయిక. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో చిన్నప్పటి మహేష్ పాత్రలో గౌతమ్ కనిపిస్తారు. ఆరేళ్ల గౌతమ్‌కిదే తొలి చిత్రం.
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ చిన్నప్పటి పాత్ర చాలా కీలకం. ఆ పాత్రను మహేష్ తనయుడు గౌతమ్‌కృష్ణతో నటింపజేయాలని సుకుమార్ భావించారట. సుకుమార్ నిర్ణయాన్ని మహేష్ కాదనలేకపోవడంతో.. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో గౌతమ్ ట్రయల్ షూట్ మొదలైంది.
మహేష్‌బాబు కూడా బాలనటుడిగానే తెరపైకి వచ్చారు. తండ్రి కృష్ణ నటించిన పలు చిత్రాల్లో మహేష్ నటించిన సంగతి తెలిసిందే. బాల నటునిగా ఎవరూ సాధించలేని స్టార్‌డమ్‌ని సొంతం చేసుకున్నారాయన. చిన్నతనంలోనే 'కొడుకుదిద్దిన కాపురం' చిత్రంలో ద్విపాత్రాభినయం చేసి 'శభాష్' అనిపించుకున్నారు. మహేష్ కోసమే అప్పట్లో కొన్ని సినిమాలు ఆడాయంటే.. అది ఏ మాత్రం అతిశయోక్తి కాదు. మరి మహేష్‌లాగే... గౌతమ్ కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడనే అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.


Click it and Unblock the Notifications











