కేక పుట్టిస్తున్న‘బిజినెస్‌మ్యాన్’రొమాంటిక్ పోస్టర్!

ముంబై మాఫియా నేపథ్యంలో సాగే బిజినెస్ మ్యాన్ షూటింగ్ ఎక్కువగా ముంబైలోనే జరిగింది. పాటలు బ్యాంకాక్ లాంటి అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించారు. ఇప్పటికే సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. పోస్టు ప్రొడక్షన్ వర్క్ సాగుతోంది. సినిమా ప్రచారం భారీ ఎత్తున చేస్తే...భారీ ఓపెనింగ్స్ ఖాయం అనే ప్లాన్ తో ఉన్న నిర్మాతలు...సంక్రాతి పండక్కి వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ 22న సినిమా ఆడియో విడుదల కానుంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న 'బిజినెస్ మ్యాన్' సినిమాను ఆర్ ఆర్ మూవీ మేకర్స్ వెంకట్ నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











