'మహేష్ ఖలేజా' ఆడియో రిలీజ్ డేట్ ఎప్పుడంటే..
మహేష్ ఖలేజా ఆడియో పంక్షన్ సెప్టెంబర్ 19న జరపటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియోని సోనీ మ్యూజిక్ వారు విపరీతమైన పోటీలో భారీ మొత్తానికి చేజిక్కిచ్చికొన్నట్లు చెప్తున్నారు. ఇక సోనీ మ్యూజిక్ వారే ఇంతకు ముందు రజనీకాంత్..రోబో చిత్రం ఆడియో రైట్స్ ని సొంతం చేసుకున్నారు. ఇక ఖలేజా షూటింగ్ ప్యాచ్ వర్క్ మినహా పూర్తయింది. ఈ చిత్రంలో మహేష్ క్యాబ్ డ్రైవర్ గా కనిపించనున్నాడు. అనూష్క..అతనికి ఎప్పుడూ దురదుష్టాన్ని తెచ్చిపెడుతూ వెనకపడే అమ్మాయిగా కనిపించి నవ్వించనుంది. దైవం మానుష్య రూపేణ అనే వేద వాక్కుని బేస్ చేసుకుని కథ అల్లినట్లు త్రివిక్రమ్ చెప్తున్నారు. అలాగే ఫేడవుట్ అయిన వేద కూడా ఓ కీలకమైన పాత్ర లోనూ, ప్రకాష్ రాజ్ విలన్ గా చేస్తున్నాడు. ప్రకాష్ రాజ్, మహేష్ ల మద్య జరిగే క్లైమాక్స్ సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయంటున్నారు. అలాగే ఈ చిత్రాన్ని అక్టోబర్ 6న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











