పవన్ మోసంతో పూనమ్ ఆత్మహత్యాయత్నం, త్రివిక్రమ్ క్షుద్రపూజలు: 6 ప్రశ్నలతో ‘కత్తి’ సంచలనం!
Recommended Video

గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్న మహేష్ కత్తి..... తన వ్యాఖ్యలకు అడ్డుతగిలిన హీరోయిన్ పూనమ్ కౌర్‌ను టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్, పూనమ్ కౌర్ బండారం బయట పెడతాను, దమ్ముంటే వచ్చి అడ్డుకోండి, నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి అంటూ సవాల్ చేసిన మహేష్ కత్తి ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంచలన విషయాలు బయట పెట్టారు. ఈ సందర్భంగా పూనమ్ కౌర్, పవన్ కళ్యాణ్‌కు 6 ప్రశ్నలు సంధించారు.

పూనమ్...మీకు ఆ పదవి ఎలా వచ్చింది?
పవన్ కళ్యాణ్ సిఫారసు చేయడంతో పూనమ్‌కు ఏపీ చేనేత పరిశ్రమకు బ్రాండ్ అంబాసిడర్ పదవిని దక్కిందని మహేష్ కత్తి తీవ్రమైన నిన్న తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మీకు బ్రాండ్ అంబాసిడర్ గా పదవి ఎవరి వలన వచ్చింది? అని మహేష్ కత్తి మీడియా ముఖంగా ఆమెను ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ గోత్ర నామాలతో పూనమ్ పూజ
తిరుమలలో పవన్ కళ్యాణ్ తో పాటు నిలబడి ఒకే గోత్ర నామాలతో మీరు పూజ ఎందుకు చేయించుకున్నారు?.... అని మహేష్ కత్తి పూనమ్ కౌర్‌ను ప్రశ్నించారు.

పవన్ మోసం చేశాడనే బాధతో ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు?
పవన్ కళ్యాణ్ మోసం చేశాడనే బాధతో మీరు ఆత్మహత్య యత్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మిమ్మల్ని కాపాడింది ఎవరు? మీరు ఉన్న ఆసుపత్రి ఏమిటి? ఆ బిల్స్ కట్టింది ఎవరు?.... అని మహేష్ కత్తి పూనమ్‌ను ప్రశ్నించారు.

మీ అమ్మగారిని కలిసి పవన్ ఏం ప్రమిస్ చేశారు?
పవన్ కళ్యాణ్ గారు మీ అమ్మగారిని కలిసి ఏం ప్రామిస్ చేశారు? ఇప్పటి వరకు అది నెరవేరిందా? లేదా?..... అని మహేష్ కత్తి ప్రశ్నించారు.

దర్శకుడు త్రివిక్రమ్ అంటే ఎందుకు కోపం?
దర్శకుడు త్రివిక్రమ్ అంటే మీకు ఎందుకు అంత కోపం?..... అని పూనమ్ కౌర్‌ను మహేష్ కత్తి ప్రశ్నించారు.

త్రివిక్రమ్‌తో కలిసి క్షుద్రపూజలు
క్షుద్ర మాంత్రికుడు నరసింహం క్షుద్ర పూజ చేసినపుడు..... త్రివిక్రమ్, పవణ్ కళ్యాణ్ తో కలిపి అక్కడ మీరు ఏం చేశారో చెప్పగలరా? అంటూ మహేష్ కత్తి పూనమ్‌ను ప్రశ్నించారు.

ఈ ఆరు ప్రశ్నలకు నా వద్ద ఆధారాలు ఉన్నాయి?
నేను సంధించిన ఈ ఆరు ప్రశ్నలకు నా వద్ద ఆధారాలు ఉన్నాయి. ఇక్కడికి పూనమ్ కౌర్ వచ్చి ఉంటే వాటిని బయటపెట్టే వాడిని... కానీ ఆమె రాలేదు. సమయం వచ్చినపుడు వీటికి తగిన ఆధారాలను బయట పెడతాను అని మహేష్ కత్తి తెలిపారు.

నా తల్లిని, భార్యను తిడుతుంటే ఊరుకోవాలా?
ప్రెస్ క్లబ్ వేదికగా మీడియాతో మాట్లాడిన కత్తి మహేష్ పవన్ ఫ్యాన్స్ పై విరుచుకుపడ్డాడు. తన తల్లిని, భార్యను నోటితో చెప్పలేని విధంగా బూతులు తిడుతుంటే తాను చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించాడు.

నియంత్రణలో ఉంచుకోలేని స్థితిలో
తన అభిమానులను కూడా నియంత్రణలో ఉంచుకోలేని స్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడని ఆరోపించాడు. తాను పవన్ లేదా పూనం కౌర్ ను చర్చించేందుకు రమ్మని ఆహ్వానం పంపించానని, కానీ వారు రాలేదని అన్నాడు.

సామాజిక బహిష్కరణ
తనను సామాజిక బహిష్కరణ చేయాలని కోన వెంకట్ చేసిన డిమాండును ప్రస్తావిస్తూ, ఓ దళితుడిగా తాను ఎన్నోసార్లు సామాజిక బహిష్కరణను చూశానని, సినీ ఇండస్ట్రీ నుంచి కూడా బహిష్కరించారని ఆరోపించాడు.


Click it and Unblock the Notifications











