"రేణు దేశాయ్ రెండో పెళ్లి, చంపేస్తామన్నా... పవన్ కళ్యాణ్ పట్టించుకోడా? "
పవన్ కళ్యాణ్ మీద వరుస విమర్శలు చేస్తున్న ఫిల్మ్ క్రిటిక్ మహేష్ కత్తి ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మీటింగులో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ప్రస్తావన తెచ్చారు. పవన్ కళ్యాణ్ అభిమానుల తీరును ఎండగట్టే ప్రయత్నం చేయడంతో పాటు... వారిని కంట్రోల్ చేయకుండా మౌనంగా ఉంటున్నాడంటూ పవన్ కళ్యాణ్ మీద కూడా విమర్శలు చేశారు. గతంలో రేణు దేశాయ్, పవన్ ఫ్యాన్స్ మధ్య జరిగిన గొడవను ఆయన మళ్లీ తెరపైకి తెచ్చారు.
Recommended Video


నాతో పాటు రేణు దేశాయ్ మీద సామాజిక దాడి
పవన్ కళ్యాణ్ అభిమానులు గుంపు తనతో పాటు, గతంలో పవన్ కళ్యాణ్ భార్య రేణూ దేశాయ్ పైనా సామాజిక దాడికి దిగారని మహేష్ కత్తి ఆరోపించారు.

రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవద్దా?
రేణూ దేశాయ్ తన రెండో వివాహం గురించి ప్రస్తావిస్తే.... పవన్ ఫ్యాన్స్ బెదిరింపులకు పాల్పడ్డారని, ఎవరు పెళ్లి చేసుకుంటే ఆ వ్యక్తిని చంపేస్తామని హెచ్చరించారని ఈ సందర్భంగా మహేష్ కత్తి గుర్తు చేశారు.

ఇంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?
తన అభిమానులు అంతలా రెచ్చిపోతున్నా పవన్ కళ్యాణ్ కనీసం వారించే ప్రయత్నం చేయలేదని, తన అభిమానులను తానే కంట్రోల్ చేసుకునే స్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నారని మహేష్ కత్తి విమర్శించారు.

ఇలాంటి వ్యక్తి వల్ల ఏం మేలు జరుగుతుంది?
పవన్ కళ్యాణ్ మీద తాను వ్యక్తిగతంగా ఎప్పుడూ విమర్శలు చేయలేదని, రాజకీయ పరమైన విమర్శలు మాత్రమే చేశానని కత్తి మహేష్ తెలిపారు. అభిమానులను కూడా కంట్రోల్ చేయలేని, పౌరుడిగా తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ఏం మేలు చేస్తారని... మహేష్ కత్తి ప్రశ్నించారు.

పబ్లిసిటీ కోసం కాదు, ప్రాణాల కోసం
నేనేమీ పబ్లిసిటీ కోసం ఇదంతా చేయడం లేదని, తన ప్రాణాలకు పవన్ కళ్యాణ్ అభిమానుల వల్ల ముప్పు ఉంది కాబట్టే ఇదంతా చేస్తున్నాను అని మహేష్ క త్తి తెలిపారు.


Click it and Unblock the Notifications











