Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
Kathi Mahesh ఆరోగ్య పరిస్థితిపై తాజా అప్డేట్: అదొక్కటే గుడ్ న్యూస్.. ఎక్కడ డ్యామేజ్ అయిందంటే!
ప్రముఖ నటుడు, సినీ విమర్శకుడు కత్తి మహేశ్ ప్రయాణిస్తోన్న కారుకు నెల్లూరు జిల్లాలో శనివారం ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మొదట ఆయనకు స్వల్ప గాయాలే అయ్యాయని అనుకున్నారు. కానీ, ఆ తర్వాత పరిస్థితి విషమించిందని క్లారిటీ వచ్చింది. దీంతో ఆయనను చెన్నైకు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఇక, తాజాగా కత్తి మహేశ్ ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియా వేదికగా ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ సిద్దారెడ్డి కొన్ని విషయాలు వెల్లడించారు. అసలు ఎక్కడెక్కడ గాయాలు అయ్యాయో వివరించారు. ఆ విషయాలు చూద్దాం పదండి!
కోమాలో కాదు.. షాక్‌లోనే కత్తి మహేశ్
కారు ప్రమాదం జరిగిన తర్వాత కత్తి మహేశ్ ముక్కు నుంచి పైకి తీవ్ర గాయాలు అయ్యాయని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన కోమాలోకి వెళ్లిపోయాడని.. మూడు రోజుల వరకూ ఏమీ చెప్పలేమని వైద్యులు అన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, నిన్న సాయంత్రం మాత్రం కత్తి మహేశ్ కోమాలోకి వెళ్లలేదని.. కేవలం షాక్ కారణంగానే స్ఫృహ కోల్పోయారని క్లారిటీ వచ్చింది.
అబ్జర్వేషన్లో మహేశ్.. ఇప్పుడే రిపోర్ట్స్
ప్రమాదం జరిగిన వెంటనే హైవే పోలీసులు కత్తి మహేశ్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, మెరుగైన చికిత్స కోసం బంధువులు, స్నేహితులు ఆయనను చెన్నైలోని అపోలో హాస్పటల్‌కు తీసుకు వెళ్లారు. అక్కడ మహేశ్ గాయాలను పరిశీలించిన వైద్యులు అబ్జర్వేషన్లో ఉంచారు. అంతేకాదు, ఈరోజు పరీక్షలు నిర్వహించి.. రిపోర్టులు వచ్చాకే అన్ని విషయాలు చెబుతానని అన్నారు.
ఆరోగ్య పరిస్థితిపై వెంకట్ సిద్దారెడ్డి పోస్ట్
కత్తి మహేశ్ ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి పుకార్లు మొదలవకుండా ఉండేందుకు ఆయన సన్నిహితులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ సిద్దారెడ్డి సహా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో కత్తి మహేశ్ ఆరోగ్య పరిస్థితిని వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వెంకట్ ఫేస్బుక్లో హెల్త్ బులిటెన్‌పై పోస్ట్ చేశారు.
మహేశ్ ఆరోగ్యంపై గుడ్ న్యూస్ చెప్పారు
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ సిద్దారెడ్డి తాజాగా చేసిన పోస్టులో 'కత్తి మహేశ్ ఆరోగ్యం స్థిమితంగానే ఉంది. బ్రెయిన్ ఇంజ్యురీ పెద్దది కాకపోవడం వల్ల ప్రాణాపాయం లేదని చెప్తున్నారు. మేము కూడా అక్కడి డాక్టర్స్ తో మాట్లాడ్డానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికైతే కత్తికి ప్రాణాపాయం అయితే లేదని తెలుస్తోంది. అది సంతోషించాల్సిన విషయం' అని గుడ్ న్యూస్‌ను చెప్పారాయన.
ఆ విషయం మాత్రం తేలేది మధ్యాహ్నమే
ప్రమాదం వల్ల కత్తి మహేశ్ కళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయన్న విషయం తెలిసిందే. అయితే, వీటి గురించి మాత్రం ఎటువంటి క్లారిటీ రావడం లేదు. ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ సిద్దారెడ్డి తాజాగా చేసిన పోస్టులో 'కంటి డాక్టర్ పరిశీలించిన తర్వాత కత్తి మహేశ్ కళ్లకు ఏం జరిగిందో వివరిస్తారు' అని చెప్పారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ మధ్యాహ్నానికి దీనిపై క్లారిటీ వస్తుందట.
మహేశ్ ప్రమాదంపై వైద్యులు చెప్పిందిదే
ఇప్పటి వరకూ చేసిన పరీక్షల్లో వచ్చిన రిపోర్టులు ఆధారంగా వైద్యులు వెల్లడించిన అంశాలను ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ సిద్దారెడ్డి పోస్ట్ చేశారు. 'కంటిపై జరిగిన గాయం పెద్దగా ఉంది. అలాగే, కనుగుడ్డుకు కూడా గాయం జరిగినట్లు అనుమానిస్తున్నాం. ముక్కు ఎముకకు పగుళ్లు ఉన్నాయి. బ్రెయిన్ తన పని తాను చేస్తోంది. ఎముకలకు సర్జరీ అవసరం' అని అందులో వివరించారు.
కత్తి మహేశ్ 10.45 గంటల హెల్త్ బులిటెన్
10.45 గంటల సమయంలో అపోలో వైద్యుడు కత్తి మహేశ్ ఆరోగ్యం గురించి వివరణ ఇచ్చారు. అందులో 'ప్రస్తుతానికి ప్రాణాపాయమేమి లేదు. కానీ, DAI వలన తర్వాత సమస్యలు ఉంటాయి. అవి ఏంటి అనేది డాక్టర్లు ఇంకా నిర్ధారణకు రాలేదు. రెస్పీరేషన్ లేదని ఇంకా వెంటిలేటర్ మీదే ఉంచారు. శంకర్ నేత్రాలయ నుంచి వచ్చిన వైద్య బృందం మహేష్‌ను పరిశీలిస్తున్నారు. వాళ్ళు చెప్పగానే మళ్లీ అప్డేట్ చేస్తాం' అని వివరించారు.