అర్థంకాలేదు, ఆ రెండు హైలెట్, చివర్లో సోత్కర్ష: ‘అజ్ఞాతవాసి’ టీజర్‌పై కత్తి మహేష్

By Bojja Kumar

పవన్ కళ్యాణ్ 25వ చిత్రం 'అజ్ఞాతవాసి' టీజర్ విడుదలైన ఇంటర్నెట్లో సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ మీద సినీ విమర్శకుడు మహేష్ కత్తి స్పందించారు. సాధారణంగా అయితే సినిమా రివ్యూలు మాత్రమే చెప్పే 'కత్తి' ఇపుడు టీజర్‌ను రివ్యూ చేయడం చర్చనీయాంశం అయింది.

Recommended Video

ఆడియో రిలీజ్ కు వారిని పిలువొద్దు..!
 ఆ వివాదం నేపథ్యంలో హాట్ టాపిక్

ఆ వివాదం నేపథ్యంలో హాట్ టాపిక్

‘అజ్ఞాతవాసి' టీజర్ ఎలా ఉందనే విషయాన్ని మహేష్ కత్తి రివ్యూ చేశారు. ఓ వైపు కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ అభిమానులకు, మహేష్ కత్తికి సోషల్ మీడియా వార్ నడుస్తుండటం, పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి మహేష్ కత్తి చెప్పిన కొన్ని అభిప్రాయాలు వివాదాస్పదం అయిన నేపథ్యంలో..... ‘అజ్ఞాతవాసి' టీజర్ మీద అతడు స్పందించడం హాట్ టాపిక్ అయింది.

 కథ అర్థం కాకుండా, చివర్లో సోత్కర్ష

కథ అర్థం కాకుండా, చివర్లో సోత్కర్ష

‘అజ్ఞాతవాసి' టీజర్ అన్ని టీజర్ల మాదిరిగానే... కథ అర్థం కాకుండా, మంచి మంచి షాట్లు, చివర్లో ఒక సోత్కర్షలాగా ఒక డైలాగుతో సాగిందని, ఇంతకు మించి పెద్దగా నాకు ఏమీ అర్థం కాలేదు.... అని మహేష్ కత్తి తెలిపారు.

 ఆ రెండు హైలెట్

ఆ రెండు హైలెట్

టీజర్లో రెండు అంశాలు హైలెట్ అనిపించాయి. మణికంఠ సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ప్రతి ఫ్రేమ్ చాలా కేర్‌ఫుల్‌గా చేసినట్లు అనిపించింది. మరొకటి అనిరుధ్ మ్యూజిక్. ఒక క్లాసికల్ బేస్ సాంగ్ నేపథ్యంలో కొంచెం అంత్తారింటికి దారేది మాదిరి అనిపించింది... అని మహేష్ కత్తి తెలిపారు.

 టిపికల్ త్రివిక్రమ్ స్టైల్

టిపికల్ త్రివిక్రమ్ స్టైల్

ఒక టిపికల్ త్రివిక్రమ్ స్టైల్ ఉండటం వల్ల అత్తారింటికి దారేది మాదిరిగా అనిపించడం సహజం. కథ పరంగా చూసుకుంటే ‘అజ్ఞాతవాసి'గా ఉన్న అతడు ఫ్యామిలీ కోసం ఏం చేశాడనేది పాయింట్ అని ఎప్పటి నుండో చెబుతూ వచ్చారు. అజ్ఞాతవాసం ఎందుకు వెళ్లాడు, ఫ్యామిలీకి లింకేంటి? అనే వివరాలు టీజర్లో అయితే లేవు. థియేట్రికల్ ట్రైలర్లో ఇందుకు సంబంధించి మరిన్ని క్లూస్ ఇస్తారేమో? అని కత్తి మహేష్ తెలిపారు.

 వారెవరినీ హైలెట్ చేయలేదు

వారెవరినీ హైలెట్ చేయలేదు

ఈ టీజర్లో హీరో పవన్ కళ్యాణ్‌ను తప్ప హీరోయిన్లను కానీ, ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టులను కానీ హైలెట్ చేయలేదు. ట్రైలర్లో ఇతర పాత్రల గురించి చూపిస్తారని ఆశిస్తున్నాను... అని మహేష్ కత్తి తెలిపారు.

వెరీ రీచ్, అండ్ ప్రామిసింగ్ గా ఉంది

వెరీ రీచ్, అండ్ ప్రామిసింగ్ గా ఉంది

సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ పరంగా చూస్తే.... టీజర్ లుక్ అండ్ ఫీల్ వెరీ రీచ్, అండ్ ప్రామిసింగ్ గా ఉంది. టీజర్ ద్వారా సినిమా టెక్నికల్‌గా చాలా బావుంటుందని ఒక అభిప్రాయానికి రావొచ్చు. సినిమా విడుదలైన తర్వాత తన పూర్తి అభిప్రాయాన్ని వెల్లడిస్తాను అని మహేష్ కత్తి తెలిపారు.

 కోటి దాటుతుందని అంచనా

కోటి దాటుతుందని అంచనా

‘అజ్ఞాతవాసి' టీజర్ టాలీవుడ్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక యూట్యూబ్‌లోనే ఆదివారం మధ్యాహ్నం వరకు 55 లక్షల మంది చూశారు. ఇతర మాధ్యమాల్లో కలిపి టీజర్ వ్యూస్ కోటి దాటే అవకాశం ఉందని అంటున్నారు.

 సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్

సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అజ్ఞాతవాసి' చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. జనవరి 10న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా విడుదలవుతోంది. యూఎస్ఏలో ఈ చిత్రం రికార్డు స్థాయి స్క్రీన్లలో విడుదలవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X