మరోసారి పవన్‌ను టార్గెట్ చేసిన కత్తి.. అవసరానికి తీసుకోవచ్చంటూ సెస్సేషనల్ కామెంట్స్

Recommended Video

Kathi Mahesh Targets Pawan Kalyan Again || Filmibeat Telugu

సినీ విమర్శకుడిగా తెలుగు ప్రజలకు పరిచయమయ్యారు కత్తి మహేశ్. సినిమాలు విడుదలైన రోజు ఓ న్యూస్ చానెల్‌లో రివ్యూలు చెప్పేవారు. ఆ తర్వాత తెలుగు రియాలిటీ షో.. 'బిగ్ బాస్' సీజన్ - 1లో అవకాశం రావడంతో, ఆయన వ్యవహారమే మారిపోయింది. అప్పటి వరకు కొంత మందికే తెలిసిన కత్తి మహేశ్.. హౌస్‌లోకి ఎంటరైన తర్వాత తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయం అయిపోయారు. ఇక, అప్పటి నుంచి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులతో వివాదం, శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు తదితర కారణాలతో ఆయన బాగా ఫేమస్ అయ్యారు.

సోషల్ మీడియాలో యాక్టివ్

సోషల్ మీడియాలో యాక్టివ్

కత్తి మహేశ్ సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. తన వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి, సమాజంలో జరుగుతున్న ప్రతి విషయంపై ఆయన స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొంత మందికి ఆయన శత్రువుగా మారిపోయారు. మరికొందరు మాత్రం కత్తికి సపోర్టుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే రాజకీయాలపైనా తనదైన శైలిలో పోస్టులు పెడుతున్నారు.

తరచూ వివాదాలే

తరచూ వివాదాలే

కత్తి మహేశ్ ఎక్కువగా వివాదాలతోనే సహవాసం చేస్తుంటారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులతో వివాదం, శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేయడం, చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి వాటితో ఆయన ఎంతో మంది నుంచి విమర్శలు తెచ్చుకున్నారు.

‘బిగ్ బాస్' వివాదంలో ఎంట్రీ

‘బిగ్ బాస్' షో నిర్వహకులు తమ పట్ట అనుచితంగా మాట్లాడారని శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తా ఆరోపణలు చేస్తున్న సమయంలో కత్తి మహేశ్ కూడా ఓ పోస్ట్ చేశారు. ‘‘2017 లో.. బిగ్ బాస్ టీం వాళ్లు 70 రోజుకు సెక్స్ లేకుండా ఉండగలరా అని నన్ను ప్రశ్నించారు. దానికి నేను ‘బాత్రూమ్ లో కెమెరాలు ఉండవుగా! పర్లేదు మ్యానేజ్ చేసుకుంటాను' అని సమాధానమిచ్చాను. ఇదే ప్రశ్న, ఇదే టీం యాక్టివ్ సెక్స్ లైఫ్ ఉన్న బోల్డ్ అమ్మాయిని ఇప్పుడు 2019లో అడిగితే...తప్పైపోతుందా?!? జస్ట్ ఆస్కింగ్!'' అంటూ ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

మరోసారి పవన్‌పై..

మరోసారి పవన్‌పై..

కత్తి మహేశ్.. చాలా రోజులుగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనపై ఎన్నో పోస్టులు కూడా చేశారు. తాజాగా మరోసారి జనసేనానిని ఉద్దేశిస్తూ ‘‘జనసేన పార్టీని ఏ పార్టీలోనూ విలీనం చేయం- పవన్ కళ్యాణ్... నిజమే... విలీనం చేస్తే వన్ టైం సెటైల్మెంట్ అయిపోతుంది. ఇలాగే ఉంటే అవసరానికి తగ్గట్టు ప్యాకేజీలు వస్తూనే ఉంటాయి'' అని పోస్ట్ పెట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X