నేను చావుకు సిద్ధం.. మీ సామాజిక పతనం..నాగబాబు, మెగా ఫ్యామిలీపై కత్తి ఫైర్!

By Rajababu

Recommended Video

నేను చావుకు సిద్ధం.. నాగబాబు, మెగా ఫ్యామిలీపై కత్తి ఫైర్.. మీ సామాజిక పతనం

మెగా హీరోలకు, సినీ, రాజకీయ విమర్శకుడు మహేష్ కత్తి మధ్య సాగుతున్న సోషల్ మీడియా వార్ మరోసారి భగ్గుమంది. హిందూ దేవుళ్లను కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో మెగా బ్రదర్ నాగబాబు ఓ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే నాగబాబు చేసిన వ్యాఖ్యలు మహేష్ కత్తిని ఉద్దేశించనవనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో నాగబాబుపై మహేష్ కత్తి తీవ్రంగా స్పందించారు. మెగా బ్రదర్స్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేయడం మీడియాలో చర్చనీయాంశమైంది.

వీడియోలో నాగబాబు

నాస్తికత్వం పేరుతో కొందరు హిందూ దేవుళ్లను దూషిస్తున్నారు. ప్రణాళికబద్ధంగా కొందరు హిందూ మతంపై కుట్ర చేస్తున్నారు. అలాంటి వారిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కఠిన చర్యలు తీసుకోవాలి. నేను అతివాద హిందూ సంస్థలకు సంబంధించిన వాడిని కాదు. కానీ నేను సెక్యులరిస్టును అని నాగబాబు వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.

 నాగబాబుపై జాలి వేస్తున్నది

నాగబాబుపై జాలి వేస్తున్నది

నాగబాబు వ్యాఖ్యల నేపథ్యంలో మెగా ఫ్యామిలీపై తీవ్రంగా స్పందిస్తూ మహేష్ కత్తి తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. నా పేరు ఉచ్చరించకుండా నన్ను నీచుడిగా సంభోదిస్తూ నాపై నాగబాబు వ్యాఖ్యలు చేసిన వీడియోను చూశాను. ఆయనపై నాకు అపారమైన జాలి వేసింది.

మీకే అస్థిత్వం లేదు అని

మీకే అస్థిత్వం లేదు అని

నన్ను నీచుడు అని అన్నారు. నేనే ఏ నీచానికి పాల్పడ్డాను. ఒక అన్నకు తమ్ముడిగా.. ఒక తమ్ముడికి అన్నగా ఏమాత్రం అస్థిత్వం లేని మీరు నాగురించి మాట్లాడుతున్నారు. నన్ను నీచుడు అంటున్నారు. మీ ఫ్యామిలీ రామభక్తులు. అబ్బా మీరు రాముడి ఆదర్శాలు ఫాలో అవుతుంటారు. చాలా బాగా చెప్తున్నారు అని కత్తి మహేష్ ఎద్దేవా చేశారు.

ప్యాకేజీలు దండుకొంటున్నారని

ప్యాకేజీలు దండుకొంటున్నారని

జనాల్ని మోసం చేయడం, ప్యాకేజీలు దండుకోవడం, ఉన్న పార్టీలను అమ్ముకొని వేరే పార్టీలో కలవడం. జబర్ధస్ట్‌లాంటి ఓ పిచ్చి షోకు జడ్జీగా వ్యవహరిస్తూ పిచ్చి నవ్వులు నవ్వడం సమాజానికి మీరు చేసే కాంట్రిబ్యూషన్‌ అది. మీరు సమాజానికి ఆ విధంగా సేవ చేస్తుంటే నేను సొసైటీకి ప్రమాదకరంగా మారుతున్నానని అంటున్నారు అని మహేష్ కత్తి అన్నారు.

దళితుడినైనా నీచుడు అని

దళితుడినైనా నీచుడు అని

మీరు హిందువు.. మీ ఫ్యామీలీ, మీ అన్నదమ్ముల గురించి నేను మాట్లాడితే మీరు తట్టుకోవడం కష్టం. ఇక రాముడి ఆదర్శం గురించి మీ ఫ్యామిలీ ఎంత బాగా పట్టుదలతో ఉంటారనేది మాకందరికీ బాగా తెలుసు. సాధారణంగా నేను వ్యక్తుల గురించి, వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడేవాడిని కాదు. కాకపోతే దౌర్భాగ్యవశాత్తూ నీచుడు అంటూ నన్ను ఓ దళితుడిని సంబోధించడం ఎంత కుల అహంకారం ఉంటే అంటారో స్పష్టమవుతున్నది అని ఆయన ఫైర్ అయ్యాడు.

అప్పుడు నోట్లో ఏం పెట్టుకొన్నారు..

అప్పుడు నోట్లో ఏం పెట్టుకొన్నారు..

మీరు సెక్యులర్ హిందువులా? మీరు ఎక్కడ నుంచి వచ్చారు? దళితులపై దాడి జరుగుతున్నప్పుడు మీ నోర్లు ఏమైపోయాయి. నోట్లో ఏం పెట్టుకొన్నారు? ముస్లింలపై దాడి జరిగితే మోడీ భజన చేశారా? ఇప్పుడు పరిపూర్ణానంద‌స్వామి భజన చేస్తున్నారా?

నేను మాట్లాడితే తట్టుకోవడం

నేను మాట్లాడితే తట్టుకోవడం

మీ ఫ్యామీలీ, మీ అన్నదమ్ముల గురించి నేను మాట్లాడితే మీరు తట్టుకోవడం కష్టం. జాగ్రత్తగా ఉండండి. మీరు నాకు బెదిరింపులు ఇస్తారా. ఊరికే వదలారా? నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను. నా మీద చేయి పడితే ఆరెస్సెస్, వీహెచ్ పీ, బీజేపీతోసహా మీరు, పరిపూర్ణానంద స్వామి కూడా బాధ్యత వహిస్తారు.

 చావుకు సిద్ధమై పోరాటం

చావుకు సిద్ధమై పోరాటం

నా చావుకు సిద్ధంగా ఉండే పోరాటం చేస్తున్నాను. నా వాక్ స్వాతంత్ర్యం కోసం నేను పోరాడాతున్నాను. నా భావ ప్రకటన స్వేచ్ఛ కోసం పోరాడుతున్నాను. మీ మాటల సక్రమంగా ఉంటే మీ జోలికి ఎవరూ రారు. నా జోలికి ఎవరూ రావొద్దు. నా మాటలు అర్థం కాని మీరు నన్ను నీచుడు అని దూషిస్తారా అని ఘాటుగా స్పందించారు.

మీ పతనానికి మీరే కారణమని

నేను చెప్పిందేంటో అర్ధం కానీ మీరు నాకు వార్నింగ్‌ ఇస్తారా.. ఇదే పంథా మీరు కొనసాగించండీ.. మీ రాజకీయ, సినిమా జీవితం ఎంత దగుల్బాజీ, దౌర్భాగ్యమో అందరికీ వెలుగెత్తి చాటే రోజు ఒకటి వస్తుంది. మీ పతనానికి మీరే మూలం అవుతున్నారు. మీ సామాజిక పతనానికి మీరే పునాది తవ్వుకుంటున్నారు. మీరు హద్దుల్లో ఉంటే బెటర్ అని నేను కోరుకొంటున్నాను అని మహేష్ కత్తి హెచ్చరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X