For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  పవన్‌కు నాలుగో భార్యగా ఉంటానంది.. పూనమ్ కౌర్‌పై ‘కత్తి’ మాటల దాడి..

  By Rajababu
  |

  తన శరీరాకృతిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన సినీ నటి పూనమ్ కౌర్‌పై సినీ విమర్శకుడు కత్తి మహేశ్ ధ్వజమెత్తారు. సినీ అవకాశాలు లేకపోవడం వల్ల పూనమ్ నిరుద్యోగిగా మారారు. పవన్ కల్యాణ్ సిఫారసు చేయడంతో ఆమెకు ఏపీ చేనేత పరిశ్రమకు బ్రాండ్ అంబాసిడర్ పదవిని దక్కించుకొన్నారు అని మహేష్ కత్తి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పూనమ్ కౌర్ వ్యాఖ్యల నేపథ్యంలో కత్తి ఓ టెలివిజన్‌తో మాట్లాడుతూ.. ఆమెపై తీవ్రమైన ఆరోపణలు చేయడం ఈ వివాదం మరింత రాజేసేటట్టు కనిపిస్తున్నది.

  పూనమ్ సూసైడ్ వెనుక నిజాలు ఇవేనట ! సోషల్ మీడియాలో వైరల్..!
   పవన్ తరఫున పూనమ్ వకాల్తా

  పవన్ తరఫున పూనమ్ వకాల్తా

  పవన్ కల్యాణ్‌ తరఫున ఆమె వకాల్తా పుచ్చుకోని పూనమ్ మాట్లాడటంపై ఎలాంటి తప్పులేదు. ఎందుకంటే పవన్ పెట్టిన భిక్ష ప్రకారమే ఆమె ఏపీ ప్రభుత్వంలో ఓ పోస్టును దక్కించుకొన్నారు. అలాంటప్పుడు పవన్ కల్యాణ్ తరఫున మాట్లాడితే అందులో న్యాయం ఉంది.

  సంస్కారంతో మాట్లాడాలి

  సంస్కారంతో మాట్లాడాలి

  పవన్ కల్యాణ్‌కు సినీ ప్రముఖులు మద్దతు తెలపడం, అండగా నిలవడంలో ఎలాంటి తప్పులేదు. కానీ మాట్లాడే భాషలో కొంత సంస్కారం ఉండాలి. వారు సంస్కారవంతంగా మాట్లాడితే బాగుంటుంది అని కత్తి మహేష్ అన్నారు.

   ఒంటరిగానే పోరాటం

  ఒంటరిగానే పోరాటం

  నాకు వ్యతిరేకంగా ఎంతమంది మాట్లాడినా గానీ నాకు భయం లేదు. నా అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి నేను ఒంటరిగానే పోరాటం చేస్తాను

   పూనమ్ నిజాయితీకి వందనం

  పూనమ్ నిజాయితీకి వందనం

  పవన్ కల్యాణ్ అండతో ఉద్యోగం పొందిన పూనమ్.. పవన్ కల్యాణ్‌ను ఎవరైనా తిడితే ఆమె స్పందించడం ఆమె నిజాయితీ అర్ధం పడుతున్నది. ఆమె అలా వ్యవహరిస్తున్నందుకు నేను కూడా అభినందిస్తున్నాను. కానీ నన్ను ఫ్యాట్సో అని, నిరుద్యోగి అని అంటే ఊరుకోను.

   పవన్‌కు నాలుగో భార్యగా ఉంటా

  పవన్‌కు నాలుగో భార్యగా ఉంటా

  పవన్ కల్యాణ్‌కు పూనమ్ కౌర్ మద్దతుగా నిలువడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే పూనమ్ గతంలో పలు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ పవన్ కల్యాణ్‌కు నాలుగో భార్య కావడానికి సిద్ధంగా ఉంటాను అని చెప్పింది. ఆ వీడియోలు యూట్యూబ్‌లో ఉన్నాయి. మీరు చూడవచ్చు అని కత్తి మహేష్ తెలిపారు.

   పూనమ్ చెప్పింది..

  పూనమ్ చెప్పింది..

  పవన్‌కు భార్యగా ఉంటాను అని పూనమ్ కౌర్ మాట్లాడిన విషయాలు నేను అల్లిన మాటలు కాదు. సవ్యంగా ఆమె చెప్పిన మాటలే. వాస్తవాలు లేకుండా ఒకరి మీద బురద జల్లడం నా ఉద్దేశం కాదు అని ఆయన పేర్కొన్నారు.

   నేను ఏ పార్టీకి చెందను

  నేను ఏ పార్టీకి చెందను

  నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గానీ, వైఎస్ జగన్‌‌కు గానీ అనుకూలం కాదు. నేను ఎవరి వద్ద నుంచి ఆర్థికంగా లాభం పొందలేదు. నాకు ఎవరూ డబ్బుల ఇవ్వడం లేదు. తీసుకోవడం లేదు. కావాలంటే నా బ్యాంక్ అకౌంట్లు మీ టెలివిజన్ ముందు పెడుతాను.

   బిగ్‌బాస్‌తో నాకు క్లీన్ ఇమేజ్

  బిగ్‌బాస్‌తో నాకు క్లీన్ ఇమేజ్

  పవన్ కల్యాణ్‌ను విమర్శించడం వల్లనే పాపులారిటీ సాధించానని అనడం సరికాదు. నాకు ఉన్న పాపులారిటీ కారణంగానే తెలుగు బిగ్‌బాస్ చోటు దక్కింది. ఆ షో నుంచి క్లీన్ ఇమేజ్‌తో బయటకు వచ్చాను. దాంతో నాకు పాపులారిటీ బాగా పెరిగింది అని కత్తి మహేష్ అన్నారు.

  English summary
  Actress Poonam Kaur Lal indirectly targets critic Mahesh Kathi. She posted serial tweets attacking Mahesh and made comments on body shaming. Her tweets make Pawan Fans happy. But Kathi made serious allegations on Poonam Kaur while talking to A popular Television.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more