కత్తి మహేశ్‌కు సోషల్ మీడియాలో ఊహించని ప్రశ్న.. ఆ సినిమాకు రివ్యూ ఇవ్వలేనంటూ తేల్చేశాడు

కత్తి మహేశ్.. తెలుగు సినీ విమర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమైన వ్యక్తి. సినిమాలు విడుదలైన రోజు ఓ న్యూస్ చానెల్‌లో రివ్యూలు చెప్పేవారు. ఆ తర్వాత తెలుగు రియాలిటీ షో.. 'బిగ్ బాస్' సీజన్ - 1లో అవకాశం రావడంతో, ఆయన వ్యవహారమే మారిపోయింది. అప్పటి వరకు కొంత మందికే తెలిసిన కత్తి మహేశ్.. హౌస్‌లోకి ఎంటరైన తర్వాత తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయం అయిపోయారు. ఇక, అప్పటి నుంచి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులతో వివాదం, శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు తదితర కారణాలతో ఆయన బాగా ఫేమస్ అయ్యారు.

కత్తి మహేశ్ సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. తన వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి, సమాజంలో జరుగుతున్న ప్రతి విషయంపై ఆయన స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొంత మందికి ఆయన శత్రువుగా మారిపోయారు. మరికొందరు మాత్రం కత్తికి సపోర్టుగా నిలుస్తున్నారు. అంతేకాదు, తన సపోర్టర్స్‌కు రిప్లైలు కూడా ఇస్తుంటారు. తాజాగా కత్తి మహేశ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. దానిని ఉద్దేశిస్తూ ఓ నెటిజన్ ప్రశ్నించాడు. వివరాల్లోకి వెళితే..

Mahesh Kathi post On Kobbari Matta Movie

టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు తాజాగా నటించిన చిత్రం 'కొబ్బరి మట్ట'. రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలను స్టీవెన్ శంకర్ అందించారు. ఈ సినిమా విడుదలకు దగ్గరపడుతున్న నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.

దీనిని తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేసిన కత్తి మహేశ్.. 'అరాచకం' అనే క్యాప్షన్ పెట్టారు. దీంతో చాలా మంది ఆయన పోస్టుకు కామెంట్లు పెట్టారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ 'సార్.. ఈ సినిమాకు మీరు రివ్యూ ఇస్తారా' అని ప్రశ్నించాడు. దీనికి 'ఈ సినిమాకు నేను రివ్యూ ఇవ్వలేను. ఎందుకంటే ఇందులో నేను నటించాను. కాబట్టి నేను భాగస్వామిగా ఉన్న సినిమాకు రివ్యూ ఇవ్వలేను' అని సమాధానం చెప్పారు కత్తి మహేశ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X