కసెక్కిన ‘కత్తి’: పవన్ మౌనం చేతకాని తనం కాదు, తీవ్రవాదుల్ని చేయొద్దు!
ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో అజ్ఞాతవాసి సినిమా సందడి మొదలైంది. పవర్ స్టార్ గత సినిమాలన్నింటికంటే ఈ సినిమాపై క్రేజ్ పీక్ రేంజిలో ఉంది. ఇది గమనించిన ప్రభుత్వం కూడా సినిమా విడుదలైన తొలి వారం రోజుల పాటు అర్దరాత్రి షోలకు కూడా అనుమతులు ఇచ్చేసింది.
Recommended Video

ఈ సందడి అలా ఉంటే..... గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ మీద కసిగా విమర్శలు చేస్తున్న క్రిటిక్ కత్తి మహేష్.... ఆదివారం 11 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. లోకల్ మీడియాతో పాటు జాతీయ మీడియాకు ఆహ్వానం పంపారు. పవన్ కళ్యాణ్ గురించి, పూనమ్ కౌర్ గురించి సంచలన విషయాలు బయట పెడతానంటూ ఆయన పేర్కొనడంతో ఆయన ఏం చెప్పబోతున్నారు? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

ప్రెస్ మీట్, సవాల్
మీరో నేనో తేల్చుకుందాం. ఓపెన్ ఛాలెంజ్. మీ బండారం నేను బయటపెడతా. వస్తారా?" అంటూ పవన్ కళ్యాణ్, పూనం కౌర్ లను సవాల్ చేస్తూ కత్తి మహేష్ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

రంగంలోకి పవన్ అభిమానులు
కత్తి మహేష్ సవాల్ చేయడంతో...... అతన్ని ఎదుర్కొనేందుకు పవన్ ఫ్యాన్స్ సైతం ప్రెస్ క్లబ్ వద్దకు భారీగా చేరుకుంటున్నారు.

మీడియా లైవర్ కవరేజ్
కత్తి మహేష్ ప్రెస్ మీట్ మీడియా లైవ్ కవరేజ్ చేయబోతోంది. ఇక్కడ ఏం గొడవ జరుగబోతోందో అని అందరూ తమ కెమెరాలతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

భారీగా పోలీసుల మోహరింపు
పరిస్థితి గమనించిన పోలీసులు భారీగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్దకు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు, కత్తి మహేష్ ఎపిసోడ్లో ఏదైనా అపశృతి దొర్లితే వెంటనే అదుపు చేసేందుకు, అరెస్టులు సైతం చేసేందుకు సిద్ధమయ్యారు.

తీవ్రవాదులను చేయొద్దు
కత్తి మహేష్ తీరుపై సినీ రచయిత కోన వెంకట్ ఇటీవల మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మౌనాన్ని చేతకాని తనం అనుకోవద్దని, ఫ్యాన్స్‌ని రెచ్చగొట్టొద్దని, వారిని తీవ్రవాదులను చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని కోన వెంకట్ కోరారు.

ఇక చాలించు
కత్తి మహేష్ చాలా తెలివైనవారని, ఎంతో పరిజ్ఞానం ఉందని, ఆ తెలివిని మంచి మార్గంలో పెట్టాలని సూచించారు. అలా చేస్తే ఇప్పుడు మహేష్ కత్తిని ఎవరైతే విమర్శిస్తున్నారో వారే మెచ్చుకుంటారని అన్నారు.


Click it and Unblock the Notifications











