'రిస్క్ చేసి చూస్తే.. టైమేమో..': 'అజ్ఞాతవాసిపై' మహేష్ కత్తి రియాక్షన్..

Recommended Video

'అజ్ఞాతవాసి' పై మహేష్ కత్తి రియాక్షన్..!

'అజ్ఞాతవాసి' సినిమా విడుదల వేళ.. అందరి కళ్లు మహేష్ కత్తి వైపే. సినిమాపై ఆయనేం చెబుతారు?.. హిట్ అంటారా!.. లేక ఫట్ అంటారా? అన్న చర్చ జోరుగా జరుగుతోంది. పవన్ ఫ్యాన్స్ తో వివాదం నేపథ్యంలో కత్తి రివ్యూపై మరింత ఆసక్తి నెలకొంది. నేటి ఉదయం ప్రసాద్ ల్యాబ్స్‌లో సినిమా చూసిన ఆయన.. సినిమాపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

 కత్తి కామెంట్?:

కత్తి కామెంట్?:

సీరియస్ కథకు కామెడీ కథనంతో చికాకుపెట్టి సినిమాను అపహాస్యం చేసిన సినిమా అజ్ఞాతవాసి. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కెరీర్‌లో అత్యంత దారుణమైన సినిమా. రిస్క్ చేసి చూస్తే...టైమెమో... మీ ఇష్టం!(ఈ సినిమా పాట ట్యూన్‌లో).

 'ఆకట్టుకోని సినిమా':

'ఆకట్టుకోని సినిమా':

సినిమాపై నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ.. ట్రైలర్ పై కత్తి ప్రశంసలు కురిపించడంతో.. సినిమాపై ఆయన ఎలాంటి కామెంట్ చేస్తారోనన్న ఆసక్తి నెలకొంది. కానీ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదు సరికదా.. సగటు ప్రేక్షకుడికి చికాకు కలిగిస్తుందని కత్తి తేల్చేశారు.

 త్రివిక్రమ్ ఎందుకిలా?:

త్రివిక్రమ్ ఎందుకిలా?:

త్రివిక్రమ్-పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవడంతో అజ్ఞాతవాసిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కానీ ఎంచుకున్న కథకు త్రివిక్రమ్ ఇచ్చిన ట్రీట్‌మెంట్ అసలేమాత్రం బాగాలేదన్న టాక్ ఎక్కువగా వినిపిస్తోంది.

 కలెక్షన్స్‌పై ప్రభావం.. :

కలెక్షన్స్‌పై ప్రభావం.. :

సినిమాపై నెగటివ్ టాక్ రావడంతో కలెక్షన్లపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. తొలిరోజు తొలి ఆట నుంచే ఇలాంటి టాక్ రావడం పవన్ అభిమానులను నిరాశకు గురిచేసే విషయమే. ఎన్నో అంచనాలతో థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకుడిని త్రివిక్రమ్ చాలా డిసప్పాయింట్ చేశాడని అంటున్నారు.

 కత్తి స్పందనపై క్యురియాసిటీ..:

కత్తి స్పందనపై క్యురియాసిటీ..:

గతంలో పవన్ సినిమాకు నెగటివ్ రివ్యూ ఇచ్చాడన్న కారణంతో ఫ్యాన్స్ కత్తిపై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. అది మొదలు ఇరువురి మధ్య వివాదం రేగుతూ వచ్చింది.

ఇప్పటికీ ఆ వివాదం సద్దుమణగలేదు. ఈ నేపథ్యంలోనే 'అజ్ఞాతవాసి'పై కత్తి ఎలా స్పందిస్తారో అని అందరూ వేచి చూశారు. సినిమాపై ఆయన నెగటివ్ గా స్పందించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X