twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బోయపాటి టీమ్‌కి మహేష్ వార్నింగ్.. తెలుగుదేశం పార్టీ ప్రస్తావన తెస్తూ సంచలనం

    |

    ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ అంటేనే ఓ సెన్సేషన్. అప్పట్లో పవన్ కళ్యాణ్, ఆయన ఫాన్స్‌పై ఆయన కత్తి మహేష్ రేపిన దుమారం ఎప్పటికీ మరచిపోలేము. ఆ మధ్య ఏ మీడియా ఇంటర్వ్యూలో చూసినా కత్తి మహేషే దర్శనమిచ్చేవాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ తర్వాత కొన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న కత్తి మహేష్ తాజాగా మళ్లీ తన కత్తికి పదును పెడుతున్నాడు. సోషల్ మీడియా వేదికగా పలు పోస్టులు పెడుతూ సంచలనం సృష్టిస్తున్నాడు. వివరాల్లోకి పోతే..

    ట్రోల్ చేస్తున్న బ్యాచ్‌కు వార్నింగ్

    ట్రోల్ చేస్తున్న బ్యాచ్‌కు వార్నింగ్

    తనను కొందరు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారని, అలాంటి వారికి నా గట్టి వార్నింగ్ ఇదే అంటూ ఫేస్‌బుక్ వేదికగా వరుస పోస్టులు పెట్టాడు కత్తి మహేష్. అయితే అది దర్శకుడు బోయపాటికి చెందిన టీమ్ అని పేర్కొంటూ తెలుగు దేశం పార్టీ ప్రస్తావన కూడా అందులో తీసుకురావడం సినీ, రాజకీయా వర్గాల్లో చర్చనీయాంశం అయింది.

    తెలుగుదేశం ఓటమి తర్వాత కులగజ్జి ధీరులు

    కొందరు పెయిడ్ తెలుగుదేశం సోషల్ మీడియా యోధులు ఓటమి తరువాత సైలెంటుగా దుకాణం సర్దేసుకున్నారని, ఇంకొంత మంది ఆ ట్రోలింగ్ చెయ్యడానికి అలవాటుపడ్డ వీరులు అలాగే ట్రోల్స్ చేస్తున్నారని, మరికొందరు కులగజ్జి ధీరులు మాత్రం అదే బూతు పంథాలో కొనసాగుతున్నారని కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

    బోయపాటి టీంలో కొందరు అసభ్య పదజాలంతో

    ఇక ''తెలుగుదేశం పార్టీకి యాడ్స్ చేసిన బోయపాటి టీంలో కొందరు, తమ లాయల్టి ప్రూవ్ చేసుకోవడానికో, సంపాదించిన డబ్బుకు రుణం తీర్చుకోవడానికో లేక కేవలం కులగజ్జితోనో ఇంకా అసభ్య పదజాలంతో ఆన్ లైన్ ట్రోలింగ్ కి పాల్పడుతున్నారు. మీ దారి మార్చుకోమని కోరుకుంటున్నాను. మార్చుకోకుంటే,సైబరాబాద్ పోలీసులు మిమ్మల్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. జాగ్రత్త!'' అని తెలుపుతూ సంచలన పోస్ట్ పెట్టాడు కత్తి మహేష్.

    వార్నింగ్ లేదు డైరెక్ట్ శ్రీకృష్ణ జన్మస్థానమే.. జాగ్రత్త !

    వార్నింగ్ లేదు డైరెక్ట్ శ్రీకృష్ణ జన్మస్థానమే.. జాగ్రత్త !

    ''ఈరోజు ఒకడు అరెస్ట్ అయ్యాడు. మిగతా 47 మంది లిస్టు కూడా ఇంటెలిజన్స్,లా అండ్ ఆర్డర్, సైబర్ క్రైమ్ డిపార్టుమెంట్ల దగ్గరకి చేరింది. రాజకీయ విమర్శలు, విధానపరమైన విభేదాలు ఎక్కడైనా స్వాగతమే కానీ, వ్యక్తిత్వహననం, బూతులు, చావులు కోరుకోవడాలు, చంపుతామని, హానిచేస్తామని బెదిరించడాలు చేస్తే వార్నింగ్ కూడా లేకుండా డైరెక్ట్ శ్రీకృష్ణ జన్మస్థానమే. జాగ్రత్త !'' అంటూ తనను ట్రోల్స్ చేస్తున్న వారిపై కత్తి మహేష్ పవర్ ఫుల్ కత్తి దూశాడు.

    మరోసారి ఫోకస్ అవుతున్న కత్తి మహేష్

    మరోసారి ఫోకస్ అవుతున్న కత్తి మహేష్

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక కత్తి మహేష్ మరోసారి బాగా ఫోకస్ అవుతున్నాడు. ఎప్పటిలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియా సెన్సేషన్ అవుతున్నాడు. అయితే ఈ సారి సినిమా, రాజకీయాలను కూడా ఆయన లాగుతుండటం హాట్ హాట్ చర్చలకు దారితీస్తోంది.

    English summary
    In 2019 Ap Elections Telugu Desham Party loosed their ruling. Ysr cp got prestigious win. The one of the reason is Boyapati Srinu advertisements. Now Mahesh Kathi attacked Boyapati fans in Social media .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X