పవన్ కల్యాణ్‌కు కత్తి మహేశ్ వార్నింగ్.. చేసేదంతా మీ ఫ్యాన్సే.. కడుపు చించుకొంటే కాళ్ల మీద..
Recommended Video

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, క్రిటిక్ కత్తి మహేశ్ మధ్య చోటుచేసుకొంటున్న మాటల వివాదం కొత్త మలుపు తిరిగింది. శనివారం (జనవరి 6వ తేదీ) ఉదయమే ఆసక్తికరమైన మాటల యుద్దం చోటుచేసుకొన్నది. ట్విట్టర్‌లో పవన్ చేసిన ఓ పోస్ట్‌కు కత్తి మహేష్ ఘాటుగా స్పందించాడు. వారిమధ్య ఏం జరిగిందో మీరే ఓ సారి చూడండి..

సీనియర్ జర్నలిస్టు గ్రీటింగ్స్
ఉదయమే ఓ సీనియర్ జర్నలిస్టు నాకు గ్రీటింగ్స్ పంపారు. ఆయన సందేశంలో ఓ మంచి సందేశం ఉంది. దానిని చూసిన తర్వాత సమాజంతో పంచుకొవాలనుకొన్నాను. మీ అందరూ ఈ రోజు సంతోషంతో ఉండాలని కోరుకొంటున్నాను అని పవన్ ఓ ట్వీట్ చేశారు.
పవన్ రీట్వీట్ చేసిన ట్వీట్ ఇదే..
ఇంతకీ సీనియర్ జర్నలిస్టు పంపిన ట్వీట్ ఏమిటంటే.. వ్యక్తిత్వంలో నిన్ను ఓడించడం చేతకాని వాళ్లు.. నీ కులం, ధనం, వర్ణం గురించి మాట్లాడుతారు అని ట్వీట్ ఛేశారు.
కుల విభజనతో ఆర్థికంగా నష్టం
అంతేకాకుండా.. పవన్ మరో ట్వీట్ కూడా చేశారు. సమాజాన్ని కులాల వారీగా విభజించడం, కుల రాజకీయాలు, పవర్ పాలిటిక్స్ లాంటివి వాస్తవంగా ఆందోళన కలిగిస్తున్నాయి. అవి ఆర్థికపరంగా దెబ్బ తీయడమే కాకుండా సమాజానికి హానీ, కీడు తలపెడుతాయి. ఈ జాడ్యం సమాజంలో పిచ్చిగా మారింది అని పవన్ ట్వీట్ చేశారు.
పవన్ చేసేందంతా మీ ఫ్యాన్సే.. కత్తి
పవన్ ట్వీట్‌పై కత్తి మహేశ్ ఘాటుగా స్పందించారు. ధనం, వర్ణం, కులం గురించి మాట్లాడుతున్నది నీ ఫ్యాన్స్, ఫ్రెండ్స్ & గర్ల్ ఫ్రెండ్. నేను కాదు. కాబట్టి పెట్టె గడ్డేదో వాళ్ళకి పెట్టు. ఇక వ్యక్తిత్వం గురించి అంటావా...అది నువ్వు మాట్లాడకపోతేనే బెటర్! అనవసరంగా కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది. జాగ్రత్త!!!


Click it and Unblock the Notifications











