మహేష్ ‘ఖలేజా’ విడుదలకు ముందే 35కోట్ల బిజినెస్ తో సంచలనం...
త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో కనకరత్న మూవీస్ బ్యానర్ లో తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న ప్రిన్స్ మహేష్‌బాబు 'ఖలేజా" చిత్రం రేపు (07.10.10)విడుదలకు సిద్దమయింది. మరో 24 గంటలలో తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా రంజింపచేయనుంది. మొత్తం 400 ప్రింట్లతో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ మేరకు అన్ని థియేటర్లకు ప్రింట్లు చేరిపోయాయి. విడుదలకు ముందే రూ.35 కోట్ల బిజినెస్ చేసి ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించింది. ఇప్పటికే విడుదలైన సినిమాలోని పాటలకు మణిశర్మ కంపోజిషన్ కు, రామ్ జోగయ్య లిరిక్స్ కి సినీ ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మూడేళ్ల తర్వాత విడుదలవుతున్న మహేష్‌బాబు చిత్రంపై అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు.
ఖలేజా మహేష్ బాబు అనుష్క త్రివిక్రమ్ శ్రీనివాస్ శింగనమల రమేష్ సి కళ్యాణ్ మణిశర్మ khaleja mahesh babu anushka trivikram srinivas singanamala ramesh c kalyan manisharma


Click it and Unblock the Notifications