»   » 'మహేష్ ఖలేజా' కోసం నిరాహార దీక్షకైనా...

'మహేష్ ఖలేజా' కోసం నిరాహార దీక్షకైనా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

"మా నిత్యశ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై గతేడాది అక్టోబరు 20న 'ఖలేజా' అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించాం. కొత్తదర్శకుడు సుబ్బారెడ్డి చెప్పిన కథ నచ్చడంతో పూర్తి స్క్రిప్టు పనులను పూర్తి చేయించాం. టైటిల్ ‌ను కూడా అతనే సూచించడంతో వెంటనే రిజిస్టర్ చేయించాం. ఓ పెద్ద హీరోతో సినిమా చేయబోతున్నామని కూడా ప్రకటించాం. కాగా...కొన్ని రోజుల క్రితం 'ఖలేజా' అనే టైటిల్ ను మేం మహేష్, త్రివిక్రమ్ ‌లకు ఇచ్చేశామని వార్తలు వచ్చాయి. చూసి షాక్ అవ్వడం మా వంతైంది...మమ్మల్ని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు నిర్మాత ఎస్‌.విజయభాస్కర రెడ్డి ఆరోపించారు.

గురువారం ఎస్ విజయభాస్కర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ "పేరు విషయంపై వాణిజ్య మండలిలో ఫిర్యాదు చేశాం. దీంతో వారు 'మహేష్‌ ఖలేజా'గా మార్చి పోస్టర్లు విడుదల చేశారు. నిబంధనల ప్రకారం ఇది కూడా తప్పు. సినిమా పేరుకు ముందు హీరో పేరును చేర్చి వాడుకొనే నిబంధన ఇప్పటిదాకా రాలేదు. వాణిజ్య మండలి ఈ విషయంపై జోక్యం చేసుకొని మాకు న్యాయం చేయాల"ని కోరారు. అలాగే...ఎంతో కష్టపడి ఈ కథను సిద్ధం చేసుకున్నానని, ఈ విషయంతో తనకు అన్యాయం జరిగితే...ఫిలిం ఛాంబర్‌ ముందు ఆమరణ నిరాహార దీక్ష చే స్తానని దర్శకుడు సీహెచ్‌ సుబ్బారెడ్డి చెప్పారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu