ఖలేజా తో బ్రేక్ ఈవెన్ దాటేస్తున్నారు..అంటే హిట్టే అన్నమాట...
భారీ అంచనాల నడుమ విడుదలన 'మహేష్ ఖలేజా"కి మొదటి వారాంతం సెలవుల వరకు భారీ కలెక్షన్లే అభించాయి. ఇక సోమవారం నుండి వసూళ్లు మందగించినా అంత దారుణమైన స్థితిలో లేవన్నది బాక్సాఫీస్ వర్గాల సమాచారం. ఏమైనా మూడు సంవత్సరాల తర్వాత దిగిన ప్రిన్స్ స్టామినాకు తగ్గ సినిమా కాదన్న వాదన బలంగానే ఉన్నా.. సూపర్ స్టార్ అభిమానులు మాత్రం మహేష్ బాబుని తెరపైన చూసి తెగ మురిసిపోతున్నారు. ఓ వైపు హిట్టు టాకు ఉందంటున్న అభిమానులు, మరో వైపు డివైడ్ అంటున్న సామాన్య జనం వెరసి 'ఖలేజా" పరిస్థితి అర్ధం కాకుండా చేసేసాయి. ఏదేమైనా నిర్మాతలు, పంపిణీదారులు బ్రేక్ ఈవెన్ దాటేస్తున్నారు..కాబట్టి కలెక్షన్ల పరంగా 'మహేష్ ఖలేజా"ను హిట్టు కిందే జమ కట్టేయోచ్చు.
మహేష్ బాబు ఖలేజా అనుష్క త్రివిక్రమ్ శ్రీనివాస్ శింగనమల రమేష్ mahesh babu khaleja anushka trivikram srinivas singanamala ramesh


Click it and Unblock the Notifications