మహేష్ ఖలేజా కొత్త న్యూస్ ఇదే...
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న మహేష్ ఖలేజా చిత్రం షూటింగ్ దరిదాపు పూర్తయిపోయినట్లే. ఈ చిత్రంలో ఇంట్రడక్షన్ సాంగ్ హైలెట్ గా ఉండనుందని సమాచారం. ఈ పాటలో కొంత భాగాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో చిత్రీకరిస్తున్నారు. ఇక మిగిలిన పాటని రామోజీ పిల్మ్ సిటిలో నేటినుంచి(శుక్రవారం)నుంచి ఆగస్టు 22 వరకూ చిత్రీకరిస్తారు. ఈ చిత్రంలో మహేష్ క్యాబ్ డ్రైవర్ గా కనిపించనున్నాడు. అనూష్క ..హీరోయిన్ గా చేస్తోంది. వేద కూడా ఓ కీలకమైన పాత్ర లోనూ, ప్రకాష్ రాజ్ విలన్ గా చేస్తున్నాడు. ప్రకాష్ రాజ్, మహేష్ ల మద్య జరిగే క్లైమాక్స్ సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయంటున్నారు. మణిశర్మ అందించిన పాటలు త్వరలోనే విడుదల చేస్తారు. బ్యాలెన్స్ ఉన్న రెండు పాటల్ని తెరకెక్కించి సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత శింగనమల రమేష్ చెప్తున్నారు .ఈ ఇంట్రడక్షన్ సాంగ్ అనంతరం సెప్టెంబర్ మొదటి వారంలో అనూష్క కాంబినేషన్ లో డ్యూయిట్ కి ప్లాన్ చేసారు. వీటితో పాటు మరో ప్రక్క కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ హైదరాబాద్ లోనూ, డిఐ వర్క్ ముంబై ప్రైమ్ ఫోకస్ ల్యాబ్ లోనూ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











