మహేష్ ఖలేజా...ఇంట్రడక్షన్ సాంగ్ డిటేల్స్
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఖలేజా చిత్రం ఇంట్రడక్షన్ సాంగ్ చెన్నైలో చిత్రకరించటానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగస్టు 14,15 తేదిల్లో ప్యాచ్ వర్క్ హైదరాబాద్ లో పూర్తి చేసుకుని ఈ టీమ్ చెన్నై బయిలుదేరుతుంది. అక్కడ ఆగస్టు 18 నుంచి షూటింగ్ జరుగుతుంది. ఇక ఖలేజా టైటిల్ నాదేనంటూ ఓ నిర్మాత కంప్లైంట్ చేయటంతో ఈ చిత్రానికి మహేష్ ఖలేజా అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసారు. అనూష్క హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో మహేష్ క్యాబ్ డ్రైవర్ గా కనిపించనున్నారు. ప్రకాష్ రాజ్ విలన్ గా కనిపించే ఈ చిత్రం ఎక్కువ భాగం రాజస్ధాన్ బ్యాక్ డ్రాప్ లో జరగుతుందని తెలుస్తోంది. ఈ ఇంట్రడక్షన్ సాంగ్ అనంతరం సెప్టెంబర్ మొదటి వారంలో అనూష్క కాంబినేషన్ లో డ్యూయిట్ కి ప్లాన్ చేసారు. వీటితో పాటు మరో ప్రక్క కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ హైదరాబాద్ లోనూ, డిఐ వర్క్ ముంబై ప్రైమ్ ఫోకస్ ల్యాబ్ లోనూ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











