'మహేష్ ఖలేజా' రిలీజ్ డేట్ మళ్ళీ మారుతోంది
మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందిన మహేష్ ఖలేజా చిత్రం సెప్టెంబర్ 30 న రిలీజ్ చేస్తామని నిర్మాత శింగనమల రమేష్ పత్రికాముఖంగా చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటిదాకా షూటింగ్ పూర్తికాకపోవటం,మిగతా పోస్ట్ ప్రొడక్షన్ కూడా లేటవటం వంటి విషయాలు దృష్టిలో పెట్టుకుని రిలీజ్ డేట్ ని మార్చటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అక్టోబర్ ఆరు న గానీ అక్టోబర్ ఎనిమిదిన గానీ రిలీజ్ అయ్యేటట్లుందని తెలుస్తోంది. ఇక ఓ వారం రోజుల్లో మణిశర్మ స్వరపరిచిన ఆడియో రిలీజ్ చేయనున్నారు. ఇక మహేష్ బాబు ఈ చిత్రం విజయంపై చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు.
రీసెంట్ గా మహేష్ బాబు 'ఖలేజా' లో తన పాత్ర గురించి మాట్లాడుతూ.."నేను నా కెరీర్ లో ఎప్పుడూ అలాంటి రోల్ చెయ్యలేదు. ఈ చిత్రంలో నేను ఎప్పుడూ మాట్లాడుతూండే పన్నీ టాక్సీ డ్రైవర్ ని. ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిల్మ్. ఈ చిత్రంలో మెసేజ్ లు ఏమీ ఉండవు. ఏ ఫైటూ కూడా కేవలం ఫైట్ కోసమే పెట్టినట్లుండదు..అంతా రియలిస్టిక్ గా, నమ్మశక్యంగా ఉంటుంది. ఇంకా కరెక్టుగా చెప్పాలంటే ఓ మంచి చిత్రానికి ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఈ సినిమాకు ఉన్నాయి. అలాగే ఈ చిత్రంలో హైలెట్స్ గా ఎవరూ ఊహించిని విధంగా ఉండే కెమెరా వర్క్..(ముఖ్యంగా లెంగ్తీ షాట్స్, జూమ్ ఆన్ స్టెడీ కామ్), పెట్రోలు బంక్ లో ఫైట్ సీన్ (రామ్ లక్ష్మణ్ డైరక్ట్ చేసింది), బ్రహ్మానందం, సునీల్ కీ, నాకు(మహేష్) మధ్య వచ్చే కామిడీ ట్రాక్" అన్నారు.ఇక ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్ గా చేస్తోంది. అర్చన ఓ కీలకమైన పాత్రలో కనపడనుంది.


Click it and Unblock the Notifications











