600 స్క్రీన్స్ తో అంతటా మహేష్ ఖలేజానే
ఆంధ్రాలో..ఆరువందల స్క్రీన్స్ తో మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన ఖలేజా ఈ రోజు(అక్టోబర్ 7) న రిలీజైంది. ఉదయం ఏడు గంటలకే బెనిఫిట్ షో లు చాలా చోట్ల పడ్డాయి. ఇక నిన్న రాత్రి అయితే ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ ధియోటర్స్ లో తెలుగు సినీ ప్రముఖులు కోసం కొన్ని షోలు వేసారు. ఇక మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో మొన్నీ మధ్యనే రిలీజై అంతటా మంచి టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో మహేష్ క్యాబ్ డ్రైవర్ గా కనిపించనున్నాడు. అనూష్క..అతనికి ఎప్పుడూ దురదుష్టాన్ని తెచ్చిపెడుతూ వెనకపడే అమ్మాయిగా కనిపించి నవ్వించనుంది. దైవం మానుష్య రూపేణ అనే వేద వాక్కుని బేస్ చేసుకుని కథ అల్లినట్లు త్రివిక్రమ్ చెప్తున్నారు. అలాగే ఫేడవుట్ అయిన వేద కూడా ఓ కీలకమైన పాత్ర లోనూ, ప్రకాష్ రాజ్ విలన్ గా చేస్తున్నాడు. ప్రకాష్ రాజ్, మహేష్ ల మద్య జరిగే క్లైమాక్స్ సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయంటున్నారు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పేరుతో మహేష్ కనిపిస్తాడు. కీలకమైన కథంతా రాజస్ధాన్ లో జరుగుతుంది.


Click it and Unblock the Notifications











