twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ ఖలేజా తెలుగు ఇండస్ట్రీ రికార్డులను తిరిగిరాస్తుంది: అభిమానులు

    By Nageswara Rao
    |

    ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మహేష్ ఖలేజా అభిమానులు అంచనాలను అందుకోంది అంటున్నారు ఫస్ట్ డే బెనిఫిట్ షో చూసినవారు. దీనితో యావత్ ప్రపంచంలో ఉన్న ప్రిన్స్ అభిమానులు అప్పడే సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఖలేజా సినిమా తెలుగు ఇండస్ట్రీ రికార్డులను తిరిగిరాస్తుందంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మిడ్ నైట్ షోలు పడడం, తెల్లవారు జామున బెనిఫిట్ షోలు చూసిన అభిమానులు ఖలేజా సినిమా మహేష్ బాబు జీవితంలో మరో పోకిరి అంటున్నారు.

    అంతేకాకుండా మగధీర రికార్డులు కూడా ఈ సినిమాతో తుడిచిపెట్టకోనిపోతాయని అభిమానులు అంటున్నారు. కొన్ని చొట్ల పోలీసులు బెనిఫిట్ షో నిరాకరించడంతో అభిమానులు ఆందోళనలకు సిధ్దపడ్డారు. మహేష్ ఖలేజా హిట్ టాక్ రావడంతో తెల్లవారు జామునుంచి కొన్ని ధియేటర్లలో ఉదయం ఆట టిక్కట్టు బ్లాకులో దాదాపు వెయ్యి నుంటి పదహేను వందలదాకా కూడా పలుకుతుందని సమాచారం. మూడుసంవత్సరాలు ఆగినందుకు ప్రిన్స్ మహేష్ మాకు ఆ మూడు సంవత్సారాలకు సరిపడ్డ ఆనందాన్ని ఈ సినిమాలో చూపించారన్నారు. విజయవాడ మరియు సూపర్ స్టార్ సోంత జిల్లా గుంటూరు తెనాలిలో ఐతే ప్రిన్స్ మహేష్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయని అనకుంటున్నారు.

    ఇప్పటికే తెలుగు సినిమా తెరపై రాజకుమారుడిగా వెలుగోందుతున్న సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ఈ సినిమాతో తన నెంబర్ వన్ స్దానాన్ని పదిలం చేసుకుంటాడని అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీనితో మహేష్ ముందుగా చెప్పినట్లు ఈసారి నుండి అక్టోబర్ ప్రిన్స్ మహేష్ దని అభిమానులు అంటున్నారు. ఇక ఈ సినిమాని బుధవారం రాత్రి ప్రసాద్ ప్రివ్యూ ధియోటర్ లో చూసిన బాలకృష్ణ ఈ సినిమా లో మహి చాలా బాగా చేశాడని ఈ సినిమాని ఎవ్వరూ మిస్ కాకుడదని చెప్పడం కోసమెరుపు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X