twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్లాక్ బస్టర్ దర్శకుడికి బర్త్ డే విషెష్ వెల్లువ.. మహేష్, కైరా అద్వానీ ఏమన్నారంటే!

    |

    Recommended Video

    Koratala Siva Gets Birthday Wishes From Celebrities

    దర్శకుడు కొరటాల జన్మదినం నేడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పలు చిత్రాలకు రచయితగా పనిచేసిన కొరటాల మిర్చి చిత్రంతో తొలిసారి దర్శకుడిగా మారారు. ప్రభాస్ నటించిన ఈ చిత్రం ఘనవిజయం సాధిచింది. ఆ తరువాత వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ విజయాల్ని సొంతం చేసుకున్న కొరటాల టాలీవుడ్ లో క్రేజీ దర్శకుడిగా మారిపోయారు. ఆయన దర్శకత్వంలో నటించేందుకు స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపుతున్నారు.

    కొరటాల కోసం కైరా అద్వానీ

    కొరటాల కోసం కైరా అద్వానీ

    భారత అనే నేను చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది బాలీవుడ్ భామ కైరా అద్వానీ. తనకు పరిచయ చిత్రంతోనే ఘనవిజయం అందించిన దర్శకుడికి కైరా బర్త్ డే విషెష్ తెలియజేసింది. ఈ సందర్భంగా కొరటాలని ప్రశంసలతో ముంచెత్తింది.

    శుభాకాంక్షలు తెలియజేసిన మహేష్

    సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కొరటాల శివకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు. కొరటాల శివ, మహేష్ బాబు కాంబినేషన్ లో రెండు అద్భుతమైన చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీమంతుడు చిత్రం రికార్డులని తిరగరాయగా, భరత్ అనే నేను చిత్రం మంచి విజయం సాధించింది.

    రచయిత గర్వపడే దర్శకుడు

    రచయిత గర్వపడే దర్శకుడు

    ప్రముఖ రచయిత కోనవెంకట్ కొరటాలకు జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి రచయిత గర్వపడే దర్శకుడు కొరటాల శివ అని కోన వెంకట్ అన్నారు.

    నాలుగు ఘనవిజయాలు

    నాలుగు ఘనవిజయాలు

    మిర్చి చిత్రంతో దర్శకుడిగా మారిన కొరటాల శివ టాలీవుడ్ లో తిరుగులేని దర్శకుడిగా అవతరించారు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను చిత్రాలన్నీ విజయం సాధించాయి.

    English summary
    Mahesh and Kiara Advani birthday wishes to Koratala Siva. Koratala Siva became crazy director with only 4 movies
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X